బాలాసోర్(ఒడిశా): అగ్ని-4 అణ్వస్త్ర క్షిపణి మరోసారి సత్తా చాటింది. మంగళవారం ఉదయం 10:20 గంటలకు ఒడిశా తీరంలోని వీలర్ ఐలండ్ నుంచి అగ్ని-4 క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)వర్గాలు వెల్లడించాయి. సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాల విభాగం ప్రయోగాత్మకంగా ఈ పరీక్షను నిర్వహించినట్లు పేర్కొన్నాయి. అధునాతన పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బాలిస్టిక్ క్షిపణి 4 వేల కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ క్షిపణిని పరీక్షించడం ఇది నాలుగోసారి.