ఉద్యోగం పోయినా బీమా! | Insurance if even job loss! | Sakshi
Sakshi News home page

ఉద్యోగం పోయినా బీమా!

Published Tue, May 17 2016 9:09 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

ఉద్యోగం పోయినా బీమా!

ఉద్యోగం పోయినా బీమా!

ఈడీఎల్‌ఐ మూడేళ్ల పొడిగింపుపై యోచన
 
 న్యూఢిల్లీ: ఉద్యోగం పోయిన చందాదారుకూ ఆపై మూడేళ్లు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ (ఈడీఎల్‌ఐ) కింద  జీవిత బీమా సౌలభ్యాన్ని కల్పించే అంశంపై రిటైర్‌మెంట్ ఫండ్ సంస్థ- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌ఓ) కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఫండ్ ట్రస్టీల సమావేశం ఈ అంశంపై చర్చించి, ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీఎల్‌ఐ  స్కీమ్ కింద గరిష్ట బీమా మొత్తాన్ని ప్రస్తుత రూ.3.6 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు నిర్ణయాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు కూడా సమాచారం.

ఈడీఎల్‌ఐ పథకం కింద ఒక సంస్థ యాజమాన్యం తమ కార్మికుల మూల వేతనాల్లో 0.5 శాతాన్ని ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ఉద్యోగం పోతే... ఈడీఎల్‌ఐ పథకం కింద బీమా ప్రయోజనమూ ఆగిపోతుంది. తాజా ప్రతిపాదన ప్రకా రం.. ఉద్యోగం పోతే... సంబంధిత ఉద్యోగి ఈడీఎల్‌ఐ సభ్యత్వాన్ని  ‘కొంత తగ్గింపు ప్రీమియంతో’ మూడేళ్ల పాటు స్వచ్ఛందంగా కొనసాగించుకోవచ్చు. ఫండ్... తన చందాదారులకు చౌక ఇళ్ల నిర్మాణ పథకంపై కసరత్తు జరుపుతున్నట్లు ఇటీవలే కార్మిక మంత్రి దత్తాత్రేయ పార్లమెంటులో ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదు కోట్ల చందాదారులకు సంబంధించి రూ.8.5 లక్షల కోట్ల ఫండ్‌ను నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement