Labour Minister Dattatreya
-
ఈపీఎఫ్ వడ్డీరేట్లకు ఆమోదం
-
ఉద్యోగం పోయినా బీమా!
ఈడీఎల్ఐ మూడేళ్ల పొడిగింపుపై యోచన న్యూఢిల్లీ: ఉద్యోగం పోయిన చందాదారుకూ ఆపై మూడేళ్లు ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ స్కీమ్ (ఈడీఎల్ఐ) కింద జీవిత బీమా సౌలభ్యాన్ని కల్పించే అంశంపై రిటైర్మెంట్ ఫండ్ సంస్థ- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) కసరత్తు చేస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఫండ్ ట్రస్టీల సమావేశం ఈ అంశంపై చర్చించి, ఆమోదముద్ర వేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈడీఎల్ఐ స్కీమ్ కింద గరిష్ట బీమా మొత్తాన్ని ప్రస్తుత రూ.3.6 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు నిర్ణయాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు కూడా సమాచారం. ఈడీఎల్ఐ పథకం కింద ఒక సంస్థ యాజమాన్యం తమ కార్మికుల మూల వేతనాల్లో 0.5 శాతాన్ని ప్రీమియంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ఉద్యోగం పోతే... ఈడీఎల్ఐ పథకం కింద బీమా ప్రయోజనమూ ఆగిపోతుంది. తాజా ప్రతిపాదన ప్రకా రం.. ఉద్యోగం పోతే... సంబంధిత ఉద్యోగి ఈడీఎల్ఐ సభ్యత్వాన్ని ‘కొంత తగ్గింపు ప్రీమియంతో’ మూడేళ్ల పాటు స్వచ్ఛందంగా కొనసాగించుకోవచ్చు. ఫండ్... తన చందాదారులకు చౌక ఇళ్ల నిర్మాణ పథకంపై కసరత్తు జరుపుతున్నట్లు ఇటీవలే కార్మిక మంత్రి దత్తాత్రేయ పార్లమెంటులో ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐదు కోట్ల చందాదారులకు సంబంధించి రూ.8.5 లక్షల కోట్ల ఫండ్‌ను నిర్వహిస్తోంది. -
ఈపీఎఫ్ఓ ఈక్విటీ పెట్టుబడులు పెంచుతాం...
కార్మిక మంత్రి దత్తాత్రేయ వెల్లడి హైదరాబాద్: ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్ఓ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో రూ.6,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈ విషయమై బ్యాంక్‌లు, ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ అధికారులతో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నారు. వచ్చే నెలలో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) సమావేశంలో ఈ విషయమై తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఈక్విటీ మార్కెట్లో రూ.6,000 కోట్ల వరకూ పెట్టుబడులు పెట్టిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతకు మించి పెట్టుబడులు ఉండవచ్చని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి స్వల్ప కాలంలో ఎలాంటి లాభాలు రాలేదని, అయితే దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశాలున్నాయని వివరించారు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సర ఈక్విటీ పెట్టుబడులపై ఒక నివేదిక రూపాందించామని పేర్కొన్నారు.