చండీగఢ్: గుర్గావ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇటీవల జరిగిన ఏడేళ్ల చిన్నారి హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాల్సిందిగా హరియాణా ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ర్యాన్ స్కూల్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు ప్రద్యుమ్న ఠాకూర్‌పై పాఠశాల బస్సు కండక్టర్ టాయిలెట్‌లో లైంగిక దాడి చేసి, గొంతుకోసి హతమార్చటం తెలిసిందే.
అతణ్ని, పాఠశాలకు చెందిన మరో ఇద్దరు అధికారులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. విద్యార్థి తల్లిదండ్రుల కోరిక మేరకు సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాసినట్లు హరియాణా అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ ప్రసాద్ చెప్పారు. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గతవారమే బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు.