Ryan International School
-
చిన్నారి హత్యకేసులో సీబీఐ చార్జ్‌షీట్
న్యూఢిల్లీ: సంచలనం రేపిన చిన్నారి ప్రద్యుమన్ ఠాకూర్(7) హత్యకేసులో సీబీఐ సోమవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చిన్నారి ప్రద్యుమన్ హత్యకేసులో ప్రధాన నిందితుడు 16 ఏళ్ల మైనర్ విద్యార్థి అని తేల్చింది. ఈ కేసులో మొదట స్కూల్ వ్యాన్ కండక్టర్‌ను నిందితుడిగా భావించి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ హత్య కేసుతో వ్యాన్ కండక్టర్‌కు సంబంధం లేదని సీబీఐ తేల్చింది. ఢిల్లీ శివారులోని గుర్గావ్లో ఉన్న ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమన్ ఠాకూర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, గుర్గావ్ వాసుల ఆందోళనల నేపథ్యంలో హరియాణ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణలో కేసు కీలక మలుపు తిరిగింది. చిన్నారిని చంపింది వ్యాన్ కండక్టర్ కాదని, అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఈ హత్య చేశాడని సీబీఐ దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడి జువెనైల్ (బాలనేరస్తుడి)గా కాకుండా పెద్దవాడిగానే పరిగణించి కేసు విచారణ చేపట్టాలని సీబీఐ తన చార్జిషీట్లో కోర్టును అభ్యర్థించింది. విషయం తెలిసిందే. స్కూళ్లోనే విద్యార్థిని గొంతు కోసి హత్య చేయటంతో విద్యార్థుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు నేడు, రేపు నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా గుర్‌గ్రామ్‌తోపాటు చుక్కల పక్కల ప్రాంతాల్లోని పాఠశాలలన్నీ మూతపడనున్నాయి. స్కూల్ రీజీనల్ హెడ్, హెచ్ఆర్ హెడ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. -
ప్రద్యుమ్న కేసులో మరో మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన ర్యాన్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న హత్య కేసు మరో మలుపు తిరిగింది. అతడిని హత్య చేసిన 11వ తరగతి విద్యార్థిని వయోజనుడిగానే పరిగణించేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. అతడు తప్పనిసరిగా ఇతర ఖైదీల మాదిరిగానే కోర్టుకు తీసుకురావచ్చని స్పష్టం చేసింది. శుక్రవారం అతడిని కోర్టు తీసుకురావాలని, ఆ రోజు నేరం చేసినట్లు రుజువైతే అతడికి 21 ఏళ్లు నిండే వరకు బాల నేరస్తుల గృహంలో ఉంచి ఆ తర్వాత జైలుకు తరలించనున్నారు. గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడేళ్ల విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పాఠశాల బస్ కండక్టర్ ఈ హత్య చేసినట్లు తొలుత భావించినా అతడిని దోషిగా చేసేందుకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐ తెలిపింది. అనంతరం చేసిన దర్యాప్తులో ప్రద్యుమ్నను హత్య చేశాడనే ఆరోపణలపై అదే స్కూల్లో 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని బాలనేరస్తుల చట్టం కింద సీబీఐ అరెస్టు చేసింది. చదువులో బాగా వెనుకబడిన నిందితుడు తల్లిదండ్రుల సమావేశాన్ని, పరీక్షను వాయిదా వేయించేందుకు ఈ హత్య చేసినట్లు గుర్తించాడు. రెండోక్లాసు చదివే ప్రద్యుమ్నను సెప్టెంబరు 8న పాఠశాల వాష్‌రూంలో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ కేసులో మొదట పాఠశాల బస్ కండక్టర్ అశోక్‌ను అరెస్టు చేశారు. కాగా, సీబీఐ అరెస్టు చేసిన బాల నేరస్తుడిని మేజర్‌గానే పరిగణించి విచారించాలని ప్రద్యుమ్న కుంటుంబీకులు, వారి తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. ఉరిశిక్ష పడేలా పోరాడుతామని ఆ సమయంలో చెప్పగా వారి విజ్ఞప్తి మేరకు అతడిని యుక్తవయస్కుడిగానే గుర్తించి విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది. -
ప్రద్యుమ్నను హత్య చేసింది సీనియరే!
న్యూఢిల్లీ: గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో హత్యకు గురైన ఏడేళ్ల విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. పోలీసులు చెబుతున్నట్లుగా ఈ నేరానికి పాల్పడింది పాఠశాల బస్ కండక్టర్ కాదని సీబీఐ విచారణలో తేలింది. ప్రద్యుమ్నను హత్య చేశాడనే ఆరోపణలపై అదే స్కూల్లో 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని బాలనేరస్తుల చట్టం కింద మంగళవారం రాత్రి సీబీఐ అరెస్టు చేసింది. చదువులో బాగా వెనుకబడిన నిందితుడు తల్లిదండ్రుల సమావేశాన్ని, పరీక్షను వాయిదా వేయించేందుకు ఈ హత్య చేశాడు. రెండోక్లాసు చదివే ప్రద్యుమ్నను సెప్టెంబరు 8న పాఠశాల వాష్‌రూంలో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ కేసులో మొదట పాఠశాల బస్ కండక్టర్ అశోక్‌ను అరెస్టు చేశారు. అశోక్ దోషి అని నిరూపించేందుకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు తమకు ఆనవాళ్లు కనిపించలేదనీ, హత్య మూడు నుంచి నాలుగు నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు గుర్తించామని చెప్పారు. అనుమానితుల కాల్ డేటా పరిశీలించామనీ, సీసీటీవీ ఫుటేజీ పరీక్షించి విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారించాక 11వ తరగతి విద్యార్థే నిందితుడని తాము తేల్చామని అధికారి చెప్పారు. పరీక్షను వాయిదా వేయించేందుకు సెప్టెంబరు 8న ఎవరో ఒకరిని చంపాలని నిందితుడు ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడని అధికారి వెల్లడించారు. నిందితుడి తండ్రి మాట్లాడుతూ తమ కొడుకు అమాయకుడని చెప్పుకొచ్చారు. సీబీఐ అరెస్టు చేసిన బాల నేరస్తుడిని మేజర్‌గానే పరిగణించి విచారించాలని ప్రద్యుమ్న కుంటుంబీకులు, వారి తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. ఉరిశిక్ష పడేలా పోరాడుతామని చెప్పారు. -
ప్రద్యుమ్న హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్..!
-
షాకింగ్ ట్విస్ట్.. పరీక్షలు వాయిదా వేయించేందుకేనా?
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం రేపిన ఏడేళ్ల ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకుంది. పరీక్షలు వాయిదా వేసేందుకు అతడు చిన్నారి ప్రద్యుమ్నను హత్య చేసినట్టు కథనాలు వస్తున్నాయి. చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని గతంలో పేర్కొనగా.. ఇప్పుడు అలాంటిదేమీ లేదని సీబీఐ అంటోంది. గుర్గావ్లోని ప్రముఖ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో సెప్టెంబర్ 8న ఏడేళ్ల చిన్నారి ప్రద్యుమ్న ఠాకూర్ కిరాతకంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్నస్కూల్ సీఈవో ర్యాన్ పింటో, అతని తల్లిదండ్రులు, స్కూల్ ఫౌండింగ్ చైర్మన్ అయిన ఆగస్టిన్ పింటో, ఎండీ గ్రేస్ పింటోలకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అదుపులోకి తీసుకున్న విద్యార్థికి ప్రద్యుమ్న హత్యకు సంబంధం ఏమిటి? అన్నది దర్యాప్తు సంస్థ ఇంకా స్పష్టం చేయడం లేదు. మరోవైపు తమ కొడుకు అమాయకుడని, అతనికి ఈ కేసుతో సంబంధం లేదని విద్యార్థి తల్లిండ్రులు అంటున్నారు. ‘సీబీఐ మంగళవారం రాత్రి నా కొడుకును అదుపులోకి తీసుకుంది. అతడు ఈ నేరాన్ని చేయలేదు. కేవలం గార్డెనర్‌కు, టీజర్లకు జరిగిన దారుణం గురించి చెప్పాడంతే’ అని విద్యార్థి తండ్రి తెలిపారు. కాగా, సీబీఐ బుధవారం అతన్ని జువైనెల్ బోర్డు ఎదుట హాజరు పరచబోతున్నట్టు తెలుస్తోంది. ప్రద్యుమ్న ఠాకూర్‌ను తానే హత్యచేసినట్టు ర్యాన్ స్కూల్ బస్ డ్రైవర్ అశోక్ కుమార్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. కానీ అశోక్‌కుమార్ కుటుంబసభ్యులు మాత్రం అతన్ని కావాలనే ఇరికించారని ఆరోపిస్తున్నారు. -
ర్యాన్ స్కూల్ యజమానులకు చుక్కెదురు
గుర్గావ్ : దేశంలో సంచలనం సృష్టించిన గుర్గావ్ బాలుడి హత్య కేసులో పాఠశాల యాజమాన్యానికి చుక్కెదురైంది. తమను అరెస్టు చేయకుండా నిలుపుదల ఆదేశాలు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను పంజాబ్ హర్యానా హైకోర్టు తిరస్కరించింది. అలాగే, దీనిపై వీలయినంత త్వరగా ప్రభుత్వ స్పందన తెలియజేయాలంటూ ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమన్ ఠాకూర్ అనే ఏడేళ్ల విద్యార్థిని బస్సు కండక్టర్ అతి దారుణంగా కత్తితో గొంతుకోసి హత్య చేసిన విషయం తెలిసిందే. స్కూల్ బాత్ రూంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పింటో, గ్రేస్ పింటో, ఫ్రాన్సిస్ పింటోలను బాధ్యులుగా చేరుస్తూ వారి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు తమను అరెస్టు చేయకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా వారికి చుక్కెదురైంది. తదుపరి విచారణ ఈ నెల(సెప్టెంబర్) 25న జరగనుంది. -
‘ర్యాన్’పై సీబీఐ విచారణ జరపండి: హరియాణా
చండీగఢ్: గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇటీవల జరిగిన ఏడేళ్ల చిన్నారి హత్య కేసును సీబీఐతో విచారణ జరిపించాల్సిందిగా హరియాణా ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ర్యాన్ స్కూల్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు ప్రద్యుమ్న ఠాకూర్‌పై పాఠశాల బస్సు కండక్టర్ టాయిలెట్లో లైంగిక దాడి చేసి, గొంతుకోసి హతమార్చటం తెలిసిందే. అతణ్ని, పాఠశాలకు చెందిన మరో ఇద్దరు అధికారులను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. విద్యార్థి తల్లిదండ్రుల కోరిక మేరకు సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాసినట్లు హరియాణా అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ ప్రసాద్ చెప్పారు. ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ గతవారమే బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. -
ప్రద్యుమన్ కేసు.. అదే అధికారుల తప్పు
సాక్షి, ఛండీగఢ్: స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం మూలంగానే ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్ ప్రాణాలు కోల్పోయాడన్నది తల్లిదండ్రులు చెబుతున్న మాట. ఈ నేపథ్యంలో స్కూళ్ల భద్రతా చర్యలపై ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇదిలా ఉంటే హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. ప్రద్యుమన్ ఇంటికి వెళ్లి మరి కుటుంబ సభ్యులను పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న కొన్ని పరిణామాలపై ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. అందులో మొదటిది.. సీఎం ఖట్టర్, బాలుడి ఇంటికి రాక ముందు డాగ్ స్క్వాడ్‌తో గుర్‌గ్రామ్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే కేసు విచారణలో మాత్రం డాగ్ స్క్వాడ్ ను ఎందుకు వినియోగించలేదన్న ప్రశ్నను ఇప్పుడు లేవనెత్తుతున్నారు. ‘హత్య జరిగిన స్కూల్ టాయ్లెట్లోకి డీసీసీతో సహా పలువురు అధికారులు వెళ్లి పరిశీలించారు. వారితోపాటు క్లూస్ టీం కూడా పైపైనే ఆధారాలు సేకరించింది. ఇలాంటి కేసుల్లో డాగ్ స్క్వాడ్‌ను ఉపయోగించాలన్న కనీస ఆలోచనను కూడా అధికారులు చేయలేదు. ఆ లెక్కన్న కేసుపై వాళ్లు ఎంత శ్రద్ధగా పని చేశారో అర్థమౌతోంది’ అని బాలుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అధికారులు పెద్ద తప్పు చేశారని.. ఒకవేళ డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఉండి ఉంటే కేసులో వెలుగు చూడని బోలెడు విషయాలు బయటపడేవి కావొచ్చని వారు అంటున్నారు. బాలుడి హత్య తర్వాత ఘటనా స్థలిని శుభ్రం చేసేందుకు స్కూల్ యాజమాన్యం ప్రయత్నించిందన్న ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అధికారులు డాగ్ స్క్వాడ్ టీంలో ఒకే ఒక్క శునకాన్ని వాడుతుండటంపై కూడా విమర్శిస్తున్నారు. ప్రద్యుమ్న హత్యకు గురైన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని, మూడు నెలల పాటు నిర్వహించేందుకు ముందు వచ్చిన విషయం తెలిసిందే. -
‘ర్యాన్’ అధిపతుల ముందస్తు బెయిల్ నిరాకరణ
సాక్షి,ముంబయిః గుర్గావ్లో స్కూల్ విద్యార్థి హత్య కేసుకు సంబంధించి ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓనర్లు గ్రేస్ పింటో, అగస్టీన్ పింటో, ర్యాన్ పింటోల ముందస్తు బెయిల్ దరఖాస్తును బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. అయితే శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ వారిని అరెస్ట్ చేయరాదని కోర్టు పేర్కొంది. నిందితులు పారిపోతారనే సందేహంతో వారి పాస్‌పోర్ట్‌లను సమర్పించాల్సిందిగా కోరింది. స్కూలు ట్రస్టీలు కోరిన ముందస్తు బెయిల్‌ను వ్యతిరేకిస్తున్నట్టు గత వారం స్కూల్ వాష్‌రూమ్‌లో దారుణ హత్యకు గురైన బాలుడి తండ్రి వరుణ్ ఠాకూర్ పేర్కొన్న క్రమంలో బాంబే హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. జరిగిన దారుణ ఘటనకు స్కూల్ యాజమాన్యం, ట్రస్టీలు పూర్తి బాధ్యత వహించాలని, వారే అన్ని విధాలా జవాబుదారీ అని, వారి బెయిల్ దరఖాస్తును తిరస్కరించాలని బాధిత బాలుడి తండ్రి అన్నారు. -
సీసీటీవీ ఫుటేజీ లభ్యం.. భయానకం
న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన గుర్గావ్ బాలుడి హత్య కేసులో కీలక సీసీటీవీ ఫుటేజీ లభ్యం అయింది. టాయిలెట్‌కు సమీపంలో ఉన్న ఈ సీసీటీవీలో చనిపోయేముందు బాలుడి చివరి కదలికలు భయానకంగా కనిపించాయి. రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్న చిన్నారిని చూసి తాము సైతం చలించిపోయామని పోలీసులు వెల్లడించారు. గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్ దారుణ హత్యకు గురవ్వడంతో దేశం ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా ఈ హత్యపై తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులకు సీసీటీవీ ఫుటేజీ లభ్యం అయింది. అందులో రికార్డయిన ప్రకారం తొలుత బాలుడు వాష్ రూమ్‌లోకి వెళ్లాడు. కొద్ది సేపయిన తర్వాత బస్సు కండక్టర్ అశోక్ కుమార్ అదే వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత అశోక్ బయటకు వెళ్లిపోగా.. మెడపైనా, గొంతుపైనా భారీగా కోసిన గాయాలతో ప్రద్యుమన్ మెల్లగా గోడపట్టుకొని పాకుతూ బయటకు వచ్చాడు. ఆ తర్వాత సరిగ్గా వాష్‌రూమ్ డోర్ వద్దకు కుప్పకూలి కదలిక లేకుండా పడిపోయాడు. రక్తం మడుగులోనే పడి అక్కడే ప్రాణాలు విడిచాడు. వైద్యులు కూడా ఇప్పటికే అధిక రక్తస్రావం అవడంవల్ల బాలుడు చనిపోయినట్లు తెలిసిందే. -
గుర్గావ్ వెలుపల విచారించాలి
సుప్రీంకోర్టులో ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ పిటిషన్ న్యూఢిల్లీ: గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్ హత్య కేసును సోహ్న, గుర్గావ్లలో కాకుండా బయటి ప్రదేశాల్లోని కోర్టుల్లో విచారించాలంటూ పాఠశాల యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కోర్టులో పాఠశాల తరఫున ఎవరూ వాదించకూడదంటూ గుర్గావ్, సోహ్నల్లోని న్యాయవాదుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని స్కూల్ అధికారి కోర్టుకు తెలిపారు. ఈ వ్యాజ్యంపై విచారణను సెప్టెంబరు 18కు సుప్రీం వాయిదావేసింది. మరోవైపు ముందస్తు బెయిలు కోసం ర్యాన్ పాఠశాల సీఈవో ర్యాన్ పింటో, ఆయన తల్లిదండ్రులు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలని బాలుడి తండ్రి బాంబే హైకోర్టును కోరారు. -
'కీలక నరాలు తెగడం వల్లే అరవలేకపోయాడు'
న్యూఢిల్లీ : గుర్గావ్లో సంచలనం సృష్టించిన బాలుడి హత్య కేసుకు సంబంధించి శవ పరీక్ష నివేదిక వెల్లడైంది. బాలుడి మెడమీద కత్తితో కోయడంతో పలు ముఖ్యమైన నరాలు తెగిపోయిన కారణంగా అతడు అరవలేకపోయాడని వైద్యులు తెలిపారు. మొత్తం రెండుసార్లు బాలుడి మెడను కత్తితో కోశారని, అందులో ఒక గాయం బాలుడి ముఖ్యమైన నరాలు తెంపేసిందని, దాంతో అతడు అరిచే ప్రయత్నం చేసినా అరవలేకపోయినట్లు వెల్లడించారు. విపరీతంగా రక్తస్రావం అవడంతోనే బాలుడు మృత్యువాతపడ్డాడని చెప్పారు. అయితే, బాలుడిపై లైంగిక దాడి జరగలేదన్నారు. గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని ఆ స్కూల్‌కు చెందిన బస్సు కండక్టర్ అతి దారుణంగా కత్తితో చంపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. మరోపక్క, తమ పిల్లలకు పూర్తి భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐదో రోజు కూడా నేవీ ముంబయి పాఠశాలలో తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కేంద్రమంత్రులు మనేకా గాంధీ, ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. ఇందుకోసం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. -
ర్యాన్ స్కూల్లో ఎన్నో లోపాలు
► నిజనిర్ధారణ కమిటీ నివేదిక ► బాలుడి హత్యపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సుప్రీంలో తండ్రి పిటిషన్ గుర్గావ్/న్యూఢిల్లీ: గుర్గావ్లో ఏడేళ్ల బాలుడు ప్రద్యుమ్న ఠాకూర్ హత్య జరిగిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్వహణలో పలు లోపాలు ఉన్నట్లు నిజ నిర్ధారణ కమిటీ పేర్కొంది. బాలుడి హత్య అనంతరం సీబీఎస్ఈ నియమించిన ఈ కమిటీ తన నివేదికను సోమవారం సమర్పించింది. పాఠశాలలో సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదనీ, బస్ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవని తెలిపింది. టాయిలెట్లు పరిశుభ్రంగా లేకపోవడం, ప్రహరీ గోడ కూలిపోయి ఉండడం, కాలం చెల్లిన అగ్నిమాపక యంత్రాలను అలంకారప్రాయంగా పెట్టడం తదితరాలను నిర్వహణా లోపాలుగా కమిటీ పేర్కొంది. ఉద్యోగుల వివరాలను పాఠశాల యాజమాన్యం పోలీసులతో తనిఖీ చేయించని విషయాన్ని కమిటీ నివేదికలో ప్రస్తావించింది. మరోవైపు బాలుడి హత్య కేసును సీబీఐకి అప్పగించే విషయమై స్పందన తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు కేంద్రం, హరియాణా ప్రభుత్వాన్ని కోరింది. సీబీఐ విచారణ కోరుతూ బాలుడి తండ్రి వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం సోమవారం విచారించింది. ఇలాంటి కేసుల్లో పాఠశాల యాజమాన్యాలనే బాధ్యులను చేసేలా నిబంధనలు తీసుకురావాలని బాలుడి తండ్రి కోరగా, దీనిపై స్పందించాలని సీబీఎస్ఈని ఆదేశించింది. ముందస్తు బెయిలుకు ర్యాన్ దరఖాస్తు పాఠశాల వ్యవస్థాపక చైర్మన్ ఆగస్టీన్ పింటో, ఆయన భార్య, మేనేజింగ్ డైరెక్టర్ గ్రేస్ పింటో, వారి కొడుకు, పాఠశాల సీఈవో ర్యాన్ పింటోలు ముందస్తు బెయిలు కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. వీరిని విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ముంబైకి వెళ్లింది. -
గుర్గావ్ బాలుడి హత్య కేసు: కేంద్రానికి నోటీసులు
-
గుర్గావ్ బాలుడి హత్య కేసు: కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: గుర్గావ్ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి విద్యార్థి దారుణ హత్య ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పాటు హెచ్ఆర్డీ, హరియాణా ప్రభుత్వానికి న్యాయస్థానం సోమవారం నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లోకి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా హత్యకు గురైన విద్యార్థి ప్రద్యుమన్ ఠాకూర్ తండ్రి వరుణ్ ఠాకూర్ ... ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కేసుల విచారణకు ట్రిబ్యునల్ లేదా ఓ అధార్టీని ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. ఇవాళ వరుణ్ ఠాకూర్‌తో ఫోన్లో మాట్లాడారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం రెండేళ్ల విద్యార్థి ప్రద్యుమన్‌పై స్కూల్ బస్సు డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. అయితే ప్రతిఘటించిన అతడిని డ్రైవర్ దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. బాలుడిపై లైంగిక దాడికి తాను ప్రయత్నించానని, దీనిని బాలుడు ప్రతిఘటించడంతో చంపేశానని తెలిపాడు. 42 ఏళ్ల అశోక్ కుమార్ గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎనిమిది నెలలుగా బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్కూల్ టాయలెట్లో బాధిత బాలుడు ఒంటరిగా కనిపించాడని, దీంతో అతనిపై లైంగిక దాడిచేసేందుకు ప్రయత్నించగా.. బాలుడు తప్పించుకునేందుకు యత్నించాడని, దీంతో అతన్ని టాయ్లెట్లోకి లాక్కెళ్లి గొంతు కోసేశానని, కత్తితో బాలుడిని రెండుసార్లు పొడిచానని అతడు తెలిపాడు. అంతేకాకుండా కత్తిని కడిగి అదే ప్రదేశంలో పారేశానని చెప్పాడు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలతో నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక విద్యార్థి మృతికి బాధ్యునిగా చేస్తూ పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు మొత్తం భద్రతా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. -
గుర్గావ్లో ఏం జరుగుతోంది?
గుర్గావ్ : సంచలనం రేపిన హర్యానాలోని స్కూల్లో బాలుడి హత్య కేసు అటు పోలీసు అధికారులను పరుగులు పెట్టించడంతోపాటు స్కూల్ యజమాన్యానికి చుక్కలు చూపిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే బస్సు కండక్టర్‌ను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా స్కూల్ పరిపాలన విభాగానికి చెందిన అధికారులను కూడా అరెస్టు చేసింది. గత రాత్రి అరెస్టు చేసిన వారిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మరోపక్క, ఈ స్కూల్ గుర్తింపు విషయంపై విద్యాశాఖ మంత్రి రామ్ బిలాస్ శర్మ స్పందిస్తూ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్లక్ష్యం చేసిందని తాము కూడా అంగీకరిస్తున్నామని, అయితే, 1200మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని స్కూల్ గుర్తింపును రద్దు చేయలేమని తెలిపారు. ఈ కేసును సీబీఐ అధికారులకు అప్పగించాలంటూ పెద్ద మొత్తంలో స్కూల్ ముందు ధర్నాకు దిగిన వారిలో దాదాపు 50మందిపై లాఠీ చార్జీ చేసి గాయపరిచిన అరుణ్ అనే సీఐని కమిషనర్ సస్పెండ్ చేశారు. స్కూల్లో చాలా లోపాలున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనంటూ బాలుడి తండ్రి డిమాండ్ చేయడంతోపాటు నేడు వారు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్థానిక పోలీసుల విచారణతో తాము సంతృప్తిగా లేమని, వారు ఏదో కుట్రలు చేస్తున్నారని, నిజనిజాలు లోకానికి తెలిసేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలంటున్నామని చెప్పారు. వీరి తరుపు న్యాయవాది కూడా అత్యవసర వాదనల పేరిట సుప్రీం బెంచ్ ముందుకు పిల్‌ను తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా ఈ కేసు మీద పద్నాలుగు టీంలు పనిచేస్తున్నాయి. ఇప్పటికే ఒక టీం ముంబయిలోని స్కూల్ యజమాన్యం వద్దకు వెళ్లింది. స్కూల్ సీఈవో ర్యాన్ పింటోను పోలీసులు ప్రశ్నించనున్నారు. -
గురుగ్రామ్‌లో హైటెన్షన్.. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్
సాక్షి, గుర్‌గ్రామ్: చిన్నారి ప్రద్యుమన్ ఠాకూర్(7) హత్యా ఉదంతం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. స్కూళ్లోనే విద్యార్థిని గొంతు కోసి హత్య చేయటంతో విద్యార్థుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు నేడు, రేపు నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా గుర్‌గ్రామ్‌తోపాటు చుక్కల పక్కల ప్రాంతాల్లోని పాఠశాలలన్నీ మూతపడనున్నాయి. స్కూల్ రీజీనల్ హెడ్, హెచ్ఆర్ హెడ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అదే సమయంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని ప్రద్యుమ్న తండ్రి వరణ్ ఠాకూర్ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఈ క్రమంలో ఢిల్లీకి బయలుదేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. స్కూళ్లో సరైన భద్రత లేకపోవటమే తన కొడుకు మరణానికి కారణమైందని ఆయన ఆరోపిస్తున్నారు. సిట్ ప్రాథమిక దర్యాప్తులో కూడా ఇదే విషయం వెల్లడైందన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గొంతు కోసే సమయంలో కనీసం తన కొడుకు అరుపు ఎవరైనా విని ఉండరా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కప్పిపుచ్చేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్న నమ్మకం లేదంటూ వరుణ్ వ్యాఖ్యలు చేశారు. స్కూల్ యాజమాన్యం ఇప్పటిదాకా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని వరుణ్ బంధువు, సుప్రీంకోర్టు న్యాయవాది సుశీల్ తెక్రీవాల్ తెలిపారు. వాళ్ల తరపు తప్పు ఉంది కాబట్టే ముఖాలు చూపించుకోలేకపోతున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. స్కూల్లో వసతులు సరిగ్గా లేవని, కనీసం సీసీ కెమెరాలు కూడా సరిగ్గా పని చేయటం లేదని సిట్ ప్రాథమిక దర్యాప్తు అనంతరం వెల్లడించిన విషయం తెలిసిందే. కండక్టర్ ప్రవర్తనను పరిశీలించకుండానే స్కూల్ యాజమాన్యం విధుల్లోకి తీసుకుందని వెల్లడైంది. ‘సెక్సువల్ ప్రవర్తన’ కారణంగా అతన్ని ఇంతకు ముందు పని చేసిన స్కూల్ యాజమాన్యం విధుల నుంచి తొలగించిన విషయం వెలుగుచూసింది. ఇక స్కూల్ యాజమాన్యంపై జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 75 కింద కేసు నమోదైనట్లు విద్యాశాఖా మంత్రి రాం విలాస్ శర్మ ప్రకటించారు. స్కూల్ యాజమాన్యంతోపాటు, నిర్వాహకుల పేర్లు కూడా ఛార్జ్‌షీట్‌లో నమోదైనట్లు ఆయన వెల్లడించారు. అయినప్పటికీ శాంతించని తల్లిదండ్రులు సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం పేరెంట్స్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసి ఓ వైన్ షాపును తగలబెట్టగా, లాఠీఛార్జీలో పలువురు మీడియా సిబ్బందికి కూడా గాయాలయిన విషయం విదితమే. -
తల్లిదండ్రుల ఆగ్రహంపై పోలీసుల లాఠీ!
-
రేప్‌కు అంగీకరించలేదని చంపేశా!
ఏడేళ్ల బాలుడిని చంపిన కిరాతక బస్ డ్రైవర్ వాంగ్మూలం ర్యాన్ అంతర్జాతీయ స్కూల్ వద్ద పెద్ద ఎత్తున ప్రజాగ్రహం స్కూల్ ప్రిన్సిపాల్‌పై వేటు న్యూఢిల్లీ: గుర్గావ్లో ఏడేళ్ల బాలుడిని కిరాతకంగా హతమార్చిన కిరాతక బస్ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. బాలుడిపై లైంగిక దాడికి తాను ప్రయత్నించానని, దీనిని బాలుడు ప్రతిఘటించడంతో చంపేశానని తెలిపాడు. 42 ఏళ్ల అశోక్ కుమార్ గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎనిమిది నెలలుగా బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం స్కూల్ టాయలెట్లో ఏడేళ్ల బాధిత బాలుడు ఒంటరిగా కనిపించాడని, దీంతో అతనిపై లైంగిక దాడిచేసేందుకు ప్రయత్నించగా.. బాలుడు తప్పించుకునేందుకు యత్నించాడని, దీంతో అతన్ని టాయ్లెట్లోకి లాక్కెళ్లి గొంతు కోసేశానని, కత్తితో బాలుడిని రెండుసార్లు పొడిచానని అతడు తెలిపాడు. అంతేకాకుండా కత్తిని కడిగి అదే ప్రదేశంలో పారేశానని చెప్పాడు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలతో నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, గుర్గావ్ను దిగ్భ్రాంతపరిచిన ఈ ఘటనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం పెల్లుబుక్కుతోంది. పెద్దసంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు బాలుడి హత్యకు వ్యతిరేకంగా ర్యాన్ అంతర్జాతీయ స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి ఈ ఆందోళన కొనసాగుతోంది. స్కూలు యాజమాన్యమే బాలుడి హత్యకు కారణమని నిరసనకారులు మండిపడుతున్నారు. మరోవైపు స్కూలు తాత్కాలిక ప్రిన్సిపాల్ నీరజ బత్రాపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు విధించింది. స్కూలుపై 100 కోట్ల జరిమానా విధించాలని, స్కూల్‌ను వెంటనే మూసివేయాలని ఆలిండియా పెరెంట్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. -
సంచలనం రేపుతున్న బాలుడి హత్య
-
అలాంటి స్కూలుకు పిల్లలను ఎలా పంపాలి?
గుర్గావ్: ఓ అంతర్జాతీయ స్కూల్లో చదువుతున్న ఏడేళ్ల బాలుడిని బస్సు డ్రైవర్ కిరాతకంగా హతమార్చిన ఘటనపై గుర్గావ్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన జరిగిన ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట భారీ ప్రజలు గుమిగూడి శనివారం ఉదయం ఆందోళన నిర్వహించారు. బాలుడి హత్యతో కలత చెందిన ప్రజలు పెద్దసంఖ్యలో స్కూల్ ఎదుట ఆందోళనకు దిగడంతో.. ఇక్కడ భారీగా భద్రతా దళాలను మోహరించారు. మరోవైపు తన కొడుకును కిరాతకంగా హత్యచేయడంపై తల్లి జ్యోతి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తన బిడ్డకు పాఠశాల యాజమాన్యం కనీస భద్రతను కల్పించలేదని, ఇలాంటి స్కూల్‌కు పిల్లలను ఎలా పంపించాలని ఆమె ప్రశ్నించారు. దారుణానికి ఒడిగట్టిన బస్ కండక్టర్ ఎవరో తన కొడుకుకు కనీసం తెలియదని, తను ఎప్పుడూ స్కూల్‌బస్సులో వెళ్లలేదని, తామే స్కూల్ వద్ద దిగబెట్టి.. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లేవాళ్లమని జ్యోతి వివరించింది. మరోవైపు స్కూల్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలంటూ బాలుడి తండ్రి గుర్గావ్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రెండో తరగతి విద్యార్థి అయిన ప్రద్యుమన్ ఠాకూర్ స్కూల్ ఆవరణలోనే హత్యకు గురికావడం గుర్గావ్లో కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పాఠశాల బస్సు కండక్టర్‌గా పనిచేస్తున్న అశోక్.. స్కూలు టాయిలెట్లో బాలుడిపై అత్యాచారానికి ప్రయత్నించాడని.. దీన్ని ప్రతిఘటించిన చిన్నారి అరవటంతో అక్కడే గొంతుకోసి హతమార్చాడని పోలీసులు ధ్రువీకరించారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోహ్న ప్రాంతంలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమన్ ఠాకూర్ (7) శుక్రవారం ఉదయం 8.30 గంటలకు పాఠశాల టాయిలెట్ వద్ద రక్తపు మడుగులో పడి ఉండడాన్ని తోటి విద్యార్థులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తుండగా.. తల్లిదండ్రులు మాత్రం స్కూల్ యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
గుర్గావ్లో ఏడేళ్ల విద్యార్థి దారుణ హత్య
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ శివారులోని గుర్గావ్లో దారుణం చోటుచేసుకుంది. ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల ప్రద్యుమన్ ఠాకూర్ మృతదేహం స్కూల్ టాయ్లెట్లో పడి ఉండటాన్ని శుక్రవారం ఉదయం గుర్తించారు. కాగా ఘటనా స్థలానికి కొద్దిదూరంలో ఓ కత్తిని కూడా లభ్యమైంది. స్కూల్ యాజమాన్యం సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా కత్తితో ప్రద్యుమన్ గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. స్కూల్ సిబ్బందితో పాటు, తోటి విద్యార్థులను ప్రశ్నిస్తున్నామని, అలాగే సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి రవీంద్ర కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి స్కూల్ బస్సు డ్రైవర్, హెల్పర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని విద్యార్థి తండ్రి వరుణ్ ఠాకూర్ ఆరోపించారు. తాను ఉదయం స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు ప్రద్యుమన్ సంతోషంగా ఉన్నాడని, సుమారు తొమ్మిది గంటల సమయంలో స్కూల్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిపారు. తమ కుమారుడికి బ్లీడింగ్ అవుతోందని, ఆస్పత్రికి తీసుకువెళుతున్నామని త్వరగా రావాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలియపోయినప్పటికీ తన బిడ్డది ముమ్మాటికీ హత్యేనని ఆయన అన్నారు. గత ఏడాది ఇదే స్కూల్‌కు చెందిన వసంత్ కుంజ్ బ్రాంచ్‌లో ఒకటో తరగతి విద్యార్థి ఆడుకోవడానికి వెళ్లి...వాటర్ ట్యాంక్‌లో శవమై తేలాడు. ఇందుకు సంబంధించి స్కూల్ ప్రిన్సిపల్‌తో పాటు నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. -
టాయిలెట్లో బాలుడి మృతదేహం...
సాక్షి,న్యూఢిల్లీ: గురుగ్రాంలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో శుక్రవారం ఓ విద్యార్థి మిస్టరీ డెత్ కలకలం రేపింది. రెండవ తరగతి చదువుతున్న ప్రద్దుమాన్(7) అనే విద్యార్థి మృతదేహం పాఠశాల టాయిలెట్లో రక్తపుమడుగులో కనిపించింది. విద్యార్థి ఎలా మరణించాడో తెలియాల్సి ఉంది. విద్యార్థి ఉదయం 8.15 పాఠశాలకు వచ్చాడని, అరగంట అనంతరం అతను రక్తపుమడుగులో ఉండటం గుర్తించామని, వెంటనే బాలుడి తండ్రికి సమాచారం ఇచ్చామని స్కూల్ అధికారులు తెలిపారు. బాలుడి గొంతు కోసి చంపినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీజేపీ సభ్యత్వం తీసుకోవాలంటూ ఒత్తిళ్లు
ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలుకు నోటీసు సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సభ్యత్వం తీసుకోవాలంటూ విద్యార్థులు, సిబ్బందిపై ఒత్తిడి చేసినందుకు సంజాయిషీ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం... ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలుకు బుధవారం నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో ఇందుకు జవాబు ఇవ్వాలని ఆదేశించింది. ర్యాన్ ఇంటర్నేషనల్... నగరంలోని పేరున్న పాఠశాలల్లో ఒకటి. ఈ పాఠశాలకు నగరవ్యాప్తంగా చాలా శాఖలున్నాయి. కాగా, బీజేపీ సభ్యత్వ నమోదు తీసుకోవాలని విద్యార్థులు, టీచర్లపై ఈ పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేసినట్లు వార్తలొచ్చాయి. బీజేపీ సభ్యులుగా నమోదు కాని సిబ్బందికి మార్చి నెలలో వేతనం ఇవ్వలేదని కొందరు టీచర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్కూలు డెరైక్టర్ గ్రేసీ పింటో స్పందిస్తూ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని ధ్రువీకరించారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛంద వ్యవహారమని ఆమె తెలిపారు. గ్రేసీ పింటో ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యద ర్శిగా ఉన్నారు. అసలేం జరిగింది... వసంత్ విహార్, మయూర్‌విహార్ ఫేజ్-3, రోహిణీలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూళ్లు సిబ్బందిఒక్కొక్కరికి ఓ ఫారం ఇచ్చి పది మందిని బీజేపీ సభ్యులుగా చేర్పించాలని ఆదేశించినట్లు తెలిసింది. అంతే కాకుండా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బీజేపీ ప్రాథమిక సభ్యత్వం స్వీకరించాలని కోరుతూ సభ్యత్వ టోల్‌ఫ్రీ నంబరును వాట్సప్ సందేశం ద్వారా పంపింది. పాఠశాలలు రాజకీయాలకు ఆవాసాలుగా మారడం ప్రమాదం ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ బీజేపీ సభ్యత్వ నమోదు చేపట్టిందనే వార్తలపై డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా వివరణ కోరారు. విద్యా శాఖ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలుకు నోటీసు జారీ చేసి సంజాయిషీ కోరిందని చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. ఆ పాఠశాల యాజమాన్యం మరో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఈ విషయం నిజమని తేలితే స్కూలుపై కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. పాఠశాలలు రాజకీయాలకు ఆవాసాలుగా మారడం, పిల్లలకు రాజకీయ పార్టీలో చేరమని నేర్పడం ప్రమాదకరమని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీలోనే కాదు ఏ పార్టీలోనైనా చేరవలసిందిగా విద్యార్థులకు చెప్పడాన్ని తాము వ్యతిరేస్తామని చెప్పారు. -
మాస్టర్ ఆదిత్య రికార్డు
ముంబై: రియాన్ ఇంటర్నేషనల్ స్కూలులో పదో తరగతి చదువుతున్న మాస్టర్ ఆదిత్య భరద్వాజ్ ఈతలో రికార్డు సృష్టించాడు. కాసా దీవి నుంచి ఎలిఫెంటాకు నాలుగు గంటల పది నిమిషాల్లో చేరుకున్నాడు. ఈ రెండింటి మధ్యదూరం 19 కిలోమీటర్లు. ప్రముఖ ఈతగాళ్లు సంకేత్ సావంత్, సంతోష్ కుమార్ల మార్గదర్శనంలో ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడుగంటల పాటు సాధన చేశాడు. ఈ సందర్భంగా ఆదిత్య మీడియాతో మాట్లాడుతూ కాసా ద్వీపం నుంచి బయల్దేరిన తర్వాత తొలి రెండు గంటలపాటు అనేక అవరోధాలను ఎదుర్కొన్నానన్నాడు. ఇందుకోసం మరింత శ్రమిం చాల్సి వచ్చిందన్నాడు. ఈ ఏడాది చివరిలో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు.