టాయిలెట్‌లో బాలుడి మృతదేహం...
Published Fri, Sep 8 2017 3:29 AM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
సాక్షి,న్యూఢిల్లీ: గురుగ్రాంలోని ర్యాన్ ఇంటర్‌నేషనల్ స్కూల్‌లో శుక్రవారం ఓ విద్యార్థి మిస్టరీ డెత్ కలకలం రేపింది. రెండవ తరగతి చదువుతున్న ప్రద్దుమాన్(7) అనే విద్యార్థి మృతదేహం పాఠశాల టాయిలెట్‌లో రక్తపుమడుగులో కనిపించింది. విద్యార్థి ఎలా మరణించాడో తెలియాల్సి ఉంది.
విద్యార్థి ఉదయం 8.15 పాఠశాలకు వచ్చాడని, అరగంట అనంతరం అతను రక్తపుమడుగులో ఉండటం గుర్తించామని, వెంటనే బాలుడి తండ్రికి సమాచారం ఇచ్చామని స్కూల్ అధికారులు తెలిపారు. బాలుడి గొంతు కోసి చంపినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement