న్యూఢిల్లీ: సంచలనం రేపిన చిన్నారి ప్రద్యుమన్ ఠాకూర్(7) హత్యకేసులో సీబీఐ సోమవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చిన్నారి ప్రద్యుమన్ హత్యకేసులో ప్రధాన నిందితుడు 16 ఏళ్ల మైనర్ విద్యార్థి అని తేల్చింది. ఈ కేసులో మొదట స్కూల్ వ్యాన్ కండక్టర్‌ను నిందితుడిగా భావించి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ హత్య కేసుతో వ్యాన్ కండక్టర్‌కు సంబంధం లేదని సీబీఐ తేల్చింది.
ఢిల్లీ శివారులోని గుర్గావ్‌లో ఉన్న ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమన్ ఠాకూర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, గుర్గావ్ వాసుల ఆందోళనల నేపథ్యంలో హరియాణ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణలో కేసు కీలక మలుపు తిరిగింది. చిన్నారిని చంపింది వ్యాన్ కండక్టర్ కాదని, అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఈ హత్య చేశాడని సీబీఐ దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడి జువెనైల్ (బాలనేరస్తుడి)గా కాకుండా పెద్దవాడిగానే పరిగణించి కేసు విచారణ చేపట్టాలని సీబీఐ తన చార్జిషీట్‌లో కోర్టును అభ్యర్థించింది.
విషయం తెలిసిందే. స్కూళ్లోనే విద్యార్థిని గొంతు కోసి హత్య చేయటంతో విద్యార్థుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు నేడు, రేపు నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా గుర్‌గ్రామ్‌తోపాటు చుక్కల పక్కల ప్రాంతాల్లోని పాఠశాలలన్నీ మూతపడనున్నాయి. స్కూల్ రీజీనల్ హెడ్, హెచ్‌ఆర్ హెడ్‌లను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment