Pradyuman Thakur
-
చిన్నారి హత్యకేసులో సీబీఐ చార్జ్‌షీట్
న్యూఢిల్లీ: సంచలనం రేపిన చిన్నారి ప్రద్యుమన్ ఠాకూర్(7) హత్యకేసులో సీబీఐ సోమవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చిన్నారి ప్రద్యుమన్ హత్యకేసులో ప్రధాన నిందితుడు 16 ఏళ్ల మైనర్ విద్యార్థి అని తేల్చింది. ఈ కేసులో మొదట స్కూల్ వ్యాన్ కండక్టర్‌ను నిందితుడిగా భావించి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ హత్య కేసుతో వ్యాన్ కండక్టర్‌కు సంబంధం లేదని సీబీఐ తేల్చింది. ఢిల్లీ శివారులోని గుర్గావ్లో ఉన్న ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ప్రద్యుమన్ ఠాకూర్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, గుర్గావ్ వాసుల ఆందోళనల నేపథ్యంలో హరియాణ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణలో కేసు కీలక మలుపు తిరిగింది. చిన్నారిని చంపింది వ్యాన్ కండక్టర్ కాదని, అదే స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి ఈ హత్య చేశాడని సీబీఐ దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడి జువెనైల్ (బాలనేరస్తుడి)గా కాకుండా పెద్దవాడిగానే పరిగణించి కేసు విచారణ చేపట్టాలని సీబీఐ తన చార్జిషీట్లో కోర్టును అభ్యర్థించింది. విషయం తెలిసిందే. స్కూళ్లోనే విద్యార్థిని గొంతు కోసి హత్య చేయటంతో విద్యార్థుల భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు నేడు, రేపు నిరసన ప్రదర్శనలకు పిలుపునివ్వగా గుర్‌గ్రామ్‌తోపాటు చుక్కల పక్కల ప్రాంతాల్లోని పాఠశాలలన్నీ మూతపడనున్నాయి. స్కూల్ రీజీనల్ హెడ్, హెచ్ఆర్ హెడ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. -
ప్రద్యుమ్నను హత్య చేసింది సీనియరే!
న్యూఢిల్లీ: గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో హత్యకు గురైన ఏడేళ్ల విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్ కేసు అనూహ్య మలుపు తిరిగింది. పోలీసులు చెబుతున్నట్లుగా ఈ నేరానికి పాల్పడింది పాఠశాల బస్ కండక్టర్ కాదని సీబీఐ విచారణలో తేలింది. ప్రద్యుమ్నను హత్య చేశాడనే ఆరోపణలపై అదే స్కూల్లో 11వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల విద్యార్థిని బాలనేరస్తుల చట్టం కింద మంగళవారం రాత్రి సీబీఐ అరెస్టు చేసింది. చదువులో బాగా వెనుకబడిన నిందితుడు తల్లిదండ్రుల సమావేశాన్ని, పరీక్షను వాయిదా వేయించేందుకు ఈ హత్య చేశాడు. రెండోక్లాసు చదివే ప్రద్యుమ్నను సెప్టెంబరు 8న పాఠశాల వాష్‌రూంలో కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ కేసులో మొదట పాఠశాల బస్ కండక్టర్ అశోక్‌ను అరెస్టు చేశారు. అశోక్ దోషి అని నిరూపించేందుకు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సీబీఐకి చెందిన ఓ అధికారి చెప్పారు. బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు తమకు ఆనవాళ్లు కనిపించలేదనీ, హత్య మూడు నుంచి నాలుగు నిమిషాల వ్యవధిలోనే జరిగినట్లు గుర్తించామని చెప్పారు. అనుమానితుల కాల్ డేటా పరిశీలించామనీ, సీసీటీవీ ఫుటేజీ పరీక్షించి విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారించాక 11వ తరగతి విద్యార్థే నిందితుడని తాము తేల్చామని అధికారి చెప్పారు. పరీక్షను వాయిదా వేయించేందుకు సెప్టెంబరు 8న ఎవరో ఒకరిని చంపాలని నిందితుడు ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడని అధికారి వెల్లడించారు. నిందితుడి తండ్రి మాట్లాడుతూ తమ కొడుకు అమాయకుడని చెప్పుకొచ్చారు. సీబీఐ అరెస్టు చేసిన బాల నేరస్తుడిని మేజర్‌గానే పరిగణించి విచారించాలని ప్రద్యుమ్న కుంటుంబీకులు, వారి తరఫు న్యాయవాది డిమాండ్ చేశారు. ఉరిశిక్ష పడేలా పోరాడుతామని చెప్పారు. -
సీసీటీవీ ఫుటేజీ లభ్యం.. భయానకం
న్యూఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన గుర్గావ్ బాలుడి హత్య కేసులో కీలక సీసీటీవీ ఫుటేజీ లభ్యం అయింది. టాయిలెట్‌కు సమీపంలో ఉన్న ఈ సీసీటీవీలో చనిపోయేముందు బాలుడి చివరి కదలికలు భయానకంగా కనిపించాయి. రక్తపు మడుగులో పడి కొట్టుకుంటున్న చిన్నారిని చూసి తాము సైతం చలించిపోయామని పోలీసులు వెల్లడించారు. గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడు ప్రద్యుమన్ ఠాకూర్ దారుణ హత్యకు గురవ్వడంతో దేశం ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కూడా ఈ హత్యపై తీవ్రంగా స్పందించింది. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న పోలీసులకు సీసీటీవీ ఫుటేజీ లభ్యం అయింది. అందులో రికార్డయిన ప్రకారం తొలుత బాలుడు వాష్ రూమ్‌లోకి వెళ్లాడు. కొద్ది సేపయిన తర్వాత బస్సు కండక్టర్ అశోక్ కుమార్ అదే వాష్‌రూమ్‌లోకి వెళ్లాడు. ఆ తర్వాత అశోక్ బయటకు వెళ్లిపోగా.. మెడపైనా, గొంతుపైనా భారీగా కోసిన గాయాలతో ప్రద్యుమన్ మెల్లగా గోడపట్టుకొని పాకుతూ బయటకు వచ్చాడు. ఆ తర్వాత సరిగ్గా వాష్‌రూమ్ డోర్ వద్దకు కుప్పకూలి కదలిక లేకుండా పడిపోయాడు. రక్తం మడుగులోనే పడి అక్కడే ప్రాణాలు విడిచాడు. వైద్యులు కూడా ఇప్పటికే అధిక రక్తస్రావం అవడంవల్ల బాలుడు చనిపోయినట్లు తెలిసిందే. -
'కీలక నరాలు తెగడం వల్లే అరవలేకపోయాడు'
న్యూఢిల్లీ : గుర్గావ్లో సంచలనం సృష్టించిన బాలుడి హత్య కేసుకు సంబంధించి శవ పరీక్ష నివేదిక వెల్లడైంది. బాలుడి మెడమీద కత్తితో కోయడంతో పలు ముఖ్యమైన నరాలు తెగిపోయిన కారణంగా అతడు అరవలేకపోయాడని వైద్యులు తెలిపారు. మొత్తం రెండుసార్లు బాలుడి మెడను కత్తితో కోశారని, అందులో ఒక గాయం బాలుడి ముఖ్యమైన నరాలు తెంపేసిందని, దాంతో అతడు అరిచే ప్రయత్నం చేసినా అరవలేకపోయినట్లు వెల్లడించారు. విపరీతంగా రక్తస్రావం అవడంతోనే బాలుడు మృత్యువాతపడ్డాడని చెప్పారు. అయితే, బాలుడిపై లైంగిక దాడి జరగలేదన్నారు. గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడిని ఆ స్కూల్‌కు చెందిన బస్సు కండక్టర్ అతి దారుణంగా కత్తితో చంపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. మరోపక్క, తమ పిల్లలకు పూర్తి భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తూ ఐదో రోజు కూడా నేవీ ముంబయి పాఠశాలలో తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కేంద్రమంత్రులు మనేకా గాంధీ, ప్రకాశ్ జవదేకర్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. ఇందుకోసం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. -
గుర్గావ్ బాలుడి హత్య కేసు: కేంద్రానికి నోటీసులు
-
గుర్గావ్ బాలుడి హత్య కేసు: కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: గుర్గావ్ ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి విద్యార్థి దారుణ హత్య ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో పాటు హెచ్ఆర్డీ, హరియాణా ప్రభుత్వానికి న్యాయస్థానం సోమవారం నోటీసులు ఇచ్చింది. మూడు వారాల్లోకి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కాగా హత్యకు గురైన విద్యార్థి ప్రద్యుమన్ ఠాకూర్ తండ్రి వరుణ్ ఠాకూర్ ... ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కేసుల విచారణకు ట్రిబ్యునల్ లేదా ఓ అధార్టీని ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. ఇవాళ వరుణ్ ఠాకూర్‌తో ఫోన్లో మాట్లాడారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం రెండేళ్ల విద్యార్థి ప్రద్యుమన్‌పై స్కూల్ బస్సు డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. అయితే ప్రతిఘటించిన అతడిని డ్రైవర్ దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. బాలుడిపై లైంగిక దాడికి తాను ప్రయత్నించానని, దీనిని బాలుడు ప్రతిఘటించడంతో చంపేశానని తెలిపాడు. 42 ఏళ్ల అశోక్ కుమార్ గుర్గావ్లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఎనిమిది నెలలుగా బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. స్కూల్ టాయలెట్లో బాధిత బాలుడు ఒంటరిగా కనిపించాడని, దీంతో అతనిపై లైంగిక దాడిచేసేందుకు ప్రయత్నించగా.. బాలుడు తప్పించుకునేందుకు యత్నించాడని, దీంతో అతన్ని టాయ్లెట్లోకి లాక్కెళ్లి గొంతు కోసేశానని, కత్తితో బాలుడిని రెండుసార్లు పొడిచానని అతడు తెలిపాడు. అంతేకాకుండా కత్తిని కడిగి అదే ప్రదేశంలో పారేశానని చెప్పాడు. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలతో నిందితుడిని పోలీసులు వెంటనే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక విద్యార్థి మృతికి బాధ్యునిగా చేస్తూ పాఠశాల తాత్కాలిక ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు మొత్తం భద్రతా సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. -
గుర్గావ్లో ఏడేళ్ల విద్యార్థి దారుణ హత్య
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ శివారులోని గుర్గావ్లో దారుణం చోటుచేసుకుంది. ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏడేళ్ల ప్రద్యుమన్ ఠాకూర్ మృతదేహం స్కూల్ టాయ్లెట్లో పడి ఉండటాన్ని శుక్రవారం ఉదయం గుర్తించారు. కాగా ఘటనా స్థలానికి కొద్దిదూరంలో ఓ కత్తిని కూడా లభ్యమైంది. స్కూల్ యాజమాన్యం సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా కత్తితో ప్రద్యుమన్ గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. స్కూల్ సిబ్బందితో పాటు, తోటి విద్యార్థులను ప్రశ్నిస్తున్నామని, అలాగే సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి రవీంద్ర కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి స్కూల్ బస్సు డ్రైవర్, హెల్పర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు చనిపోయాడని విద్యార్థి తండ్రి వరుణ్ ఠాకూర్ ఆరోపించారు. తాను ఉదయం స్కూల్లో డ్రాప్ చేసినప్పుడు ప్రద్యుమన్ సంతోషంగా ఉన్నాడని, సుమారు తొమ్మిది గంటల సమయంలో స్కూల్ నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిపారు. తమ కుమారుడికి బ్లీడింగ్ అవుతోందని, ఆస్పత్రికి తీసుకువెళుతున్నామని త్వరగా రావాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏం జరిగిందో తెలియపోయినప్పటికీ తన బిడ్డది ముమ్మాటికీ హత్యేనని ఆయన అన్నారు. గత ఏడాది ఇదే స్కూల్‌కు చెందిన వసంత్ కుంజ్ బ్రాంచ్‌లో ఒకటో తరగతి విద్యార్థి ఆడుకోవడానికి వెళ్లి...వాటర్ ట్యాంక్‌లో శవమై తేలాడు. ఇందుకు సంబంధించి స్కూల్ ప్రిన్సిపల్‌తో పాటు నలుగురు సిబ్బందిని అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.