సంచలనం రేపిన ఏడేళ్ల ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకుంది. పరీక్షలు వాయిదా వేసేందుకు అతడు చిన్నారి ప్రద్యుమ్నను హత్య చేసినట్టు కథనాలు వస్తున్నాయి. చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని గతంలో పేర్కొనగా.. ఇప్పుడు అలాంటిదేమీ లేదని సీబీఐ అంటోంది.