
గుర్గావ్ వెలుపల విచారించాలి
సుప్రీంకోర్టులో ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ పిటిషన్
న్యూఢిల్లీ: గుర్గావ్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమ్న ఠాకూర్ హత్య కేసును సోహ్న, గుర్గావ్‌లలో కాకుండా బయటి ప్రదేశాల్లోని కోర్టుల్లో విచారించాలంటూ పాఠశాల యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కోర్టులో పాఠశాల తరఫున ఎవరూ వాదించకూడదంటూ గుర్గావ్, సోహ్నల్లోని న్యాయవాదుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని స్కూల్ అధికారి కోర్టుకు తెలిపారు. ఈ వ్యాజ్యంపై విచారణను సెప్టెంబరు 18కు సుప్రీం వాయిదావేసింది. మరోవైపు ముందస్తు బెయిలు కోసం ర్యాన్ పాఠశాల సీఈవో ర్యాన్ పింటో, ఆయన తల్లిదండ్రులు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలని బాలుడి తండ్రి బాంబే హైకోర్టును కోరారు.