మాస్టర్ ఆదిత్య రికార్డు | Master Aditya record | Sakshi
Sakshi News home page

మాస్టర్ ఆదిత్య రికార్డు

Published Fri, Apr 25 2014 11:19 PM | Last Updated on Sat, Sep 2 2017 6:31 AM

మాస్టర్ ఆదిత్య రికార్డు

మాస్టర్ ఆదిత్య రికార్డు

ముంబై: రియాన్ ఇంటర్నేషనల్ స్కూలులో పదో తరగతి చదువుతున్న మాస్టర్ ఆదిత్య భరద్వాజ్ ఈతలో రికార్డు సృష్టించాడు. కాసా దీవి నుంచి ఎలిఫెంటాకు నాలుగు గంటల పది నిమిషాల్లో చేరుకున్నాడు. ఈ రెండింటి మధ్యదూరం 19 కిలోమీటర్లు. ప్రముఖ ఈతగాళ్లు సంకేత్ సావంత్, సంతోష్ కుమార్‌ల మార్గదర్శనంలో ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడుగంటల పాటు సాధన చేశాడు. ఈ సందర్భంగా ఆదిత్య మీడియాతో మాట్లాడుతూ కాసా ద్వీపం నుంచి బయల్దేరిన  తర్వాత తొలి రెండు గంటలపాటు అనేక అవరోధాలను ఎదుర్కొన్నానన్నాడు. ఇందుకోసం మరింత శ్రమిం చాల్సి వచ్చిందన్నాడు. ఈ ఏడాది చివరిలో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement