ఇరోం షర్మిల కొత్త పార్టీ షురూ
మణిపూర్: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల మంగళవారం కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. పార్టీకి పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్‌గా పేరు పెట్టారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, తాను మణిపూర్ సీఎం ఓక్రం ఇబోబీసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న తౌబల్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కురాయి నుంచి బరిలోకి దిగుతానని వెల్లడించారు. సాయుధదళాల ప్రత్యేక అధికారాల చట్టం రద్దుకు తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో ఆమె ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమై రాజకీయాల గురించి చర్చించారు. అలాగే ప్రధాని మోదీ నుంచి రాజకీయ సలహాలు తీసుకుంటానని ఆమె చెప్పారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా షర్మిల 16ఏళ్లు నిరశన చేయడం తెలిసిందే.