
యువ ఇంజనీర్ అనుమానాస్పద మృతి
బనశంకరి(బెంగళూరు): బాత్రూమ్‌లో ఓ యువ ఇంజనీర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన మహదేవపుర పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆ వివరాలు... కర్ణాటకలోని చిక్కమంగళూరు నివాసి వసంతకుమార్ (24) నగరంలోని ఐటీపీఎల్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వసంతకుమార్ నారాయణపురలోని వీఆర్‌ఎస్ లేఔట్‌లో ఓ హాస్టల్‌లో స్నేహితుడు రంజిత్‌తో కలిసి ఉంటున్నాడు.
ఆదివారం ఉదయం రంజిత్ విధులకు వెళ్లగా హాస్టల్‌లో ఒంటరిగా ఉంటున్న వసంతకుమార్ సాయంత్రం బాత్రూమ్‌కు వెళ్లి అక్కడ జారిపడి మృతి చెందాడు. విధులు ముగించుకుని హస్టల్‌కు చేరుకున్న రంజిత్ బాత్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా వసంతకుమార్ మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.