చంపాడనుకుని జైల్లో వేసి.. బతికుందని వదిలారు | Jailed husband released as his 'murdered' wife shows up | Sakshi
Sakshi News home page

చంపాడనుకుని జైల్లో వేసి.. బతికుందని వదిలారు

Published Thu, Mar 12 2015 11:19 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

Jailed husband released as his 'murdered' wife shows up

బీహార్: కట్టుకున్న భార్యను హతమార్చాడనే ఆరోపణలతో అరెస్టు చేసి గత ఆరు నెలలుగా కటకటాల్లో ఉంచిన వ్యక్తిని అనంతరం తన భార్య తిరిగి రావడంతో వదిలేశారు. ఈ విచిత్ర సంఘటన బీహార్లోని షేక్ పురాలో చోటుచేసుకుంది. పునెస్రా అనే గ్రామానికి చెందిన దంపతులిద్దరు పనికోసం అహ్మదాబాద్కు బయలుదేరారు. రైలులో ఎక్కిన వారు చెరో బోగీలో ఎక్కారు. వారిద్దరిలో భార్య నిరక్షరాస్యురాలు. రైలు అహ్మదాబాద్ చేరుకున్నాక వారు ఒకరినొకరు గుర్తించడంలో విఫలమయ్యారు.

 

చాలా రోజులైన కనిపించకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు అతడిపై తమ కూతురును హత్య చేశాడని కేసు పెట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా అతడికి శిక్షపడింది. దీంతో అతను గత ఆరు నెలలుగా జైలు ఉండగా.. ఇటీవలె గతంలో కనిపించకుండా పోయిన తన భార్య ఓ మహిళల సంస్థ ద్వారా తిరిగి తమ స్వగ్రామానికి రావడంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో కోర్టు ఆమె భర్తను వదిలిపెట్టాలని ఆదేశించి పోలీసులను మందలించగా ఈ కేసు నమోదు చేసిన పోలీసు అధికారిని పై అధికారులు సస్పెండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement