జయకు కృత్రిమ శ్వాస.. యాంటీబయాటిక్స్ | jayalalitha health bulletin released | Sakshi
Sakshi News home page

జయకు కృత్రిమ శ్వాస.. యాంటీబయాటిక్స్

Published Mon, Oct 10 2016 5:14 PM | Last Updated on Tue, Aug 14 2018 2:14 PM

జయకు కృత్రిమ శ్వాస.. యాంటీబయాటిక్స్ - Sakshi

జయకు కృత్రిమ శ్వాస.. యాంటీబయాటిక్స్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ఆమె కోలుకుంటున్నారని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం సీఎం జయ హెల్త్ బులెటిన్ను అపోలో వైద్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు జయలలితకు కృత్రిమ శ్వాస అందిస్తున్నట్లు చెప్పారు.

చికిత్సకు సంబంధించి యాంటీ బయటిక్స్ అందిస్తున్నామని తెలిపారు. ఇక న్యూట్రిషీయన్ సపోర్టుతో పాసివ్ ఫీజియో తెరఫీ చేస్తున్నామని వివరించారు. ఎయిమ్స్ డాక్టర్ జీ ఖిల్నానీ పర్యవేక్షణలో జయలలితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యం జయలలిత ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నామని అపోలో వైద్యులు వివరించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement