న్యూఢిల్లీ: జ్యుడీషియల్ నియామకాలలో పారదర్శకత లక్ష్యంగా రూపొందించే బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ బిల్లుపై పార్టీలో సంప్రదింపులు పూర్తయిన అనంతరం సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై అంతర్గత చర్చ ముగిసిన అనంతరం, బిల్లును కేబినెట్ ఆమోదానికి, ఆ తర్వాతి వారమే పార్లమెంటు ముందుకు పంపనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జడ్జీల సిఫార్సులతోనే జడ్జీలను నియమించేందుకు వీలుకలిగించే కొలీజియం వ్యవస్థను రద్దుచేయాలని పలువురు న్యాయకోవిదులు చెప్పడంతో జ్యుడీషియల్ నియామకాల బిల్లు వ్యవహారం మరింత వేగవంతమైంది.
ఈ వారంలో అయితే, బడ్జెట్ కేటాయింపుల అనంతరం, బీమాబిల్లు, సెబీ బిల్లులను ప్రభుత్వం పార్లమెంటులో చేపట్టనుంది. జ్యుడీషియల్ సంస్కరణలపై సోమవారం జరిగిన భేటీలో కూడా కొలీజియం వ్యవస్థ పూర్తిగా మార్చాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. జ్యుడీషియల్ నియామకాలు మరింత పారదర్శకత అవసరమన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు.
వచ్చేవారం పార్లమెంటుకు ‘జ్యుడీషియల్’ బిల్లు
Published Wed, Jul 30 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM
Advertisement