Judicial Commission Bill
-
జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటులో కీలక అడుగు
అమరావతి : అత్యుత్తమ పారదర్శక విధానం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం మేరకు తీసుకు వచ్చిన ముందస్తు న్యాయ సమీక్ష చట్టం అమలుకు సర్వం సిద్ధమవుతోంది. జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ కోసం హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి శివశంకరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ టెండర్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమ పారదర్శక విధానానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం రోజునే దీనిపై ప్రకటన చేశారు. తన పాలనలో సుపరిపాలన పారదర్శకత కోసం చట్టాన్ని తీసుకురానున్నట్టు వెల్లడించారు. ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత ప్రక్రియ కోసం హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జిని సూచించాలంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను సీఎం వైఎస్ జగన్ కోరారు. అందులో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జులై 26, 2019న న్యాయ సమీక్ష బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. మౌలిక సదుపాయాలకు సంబంధించిన 25 రకాల పనులు ముందస్తు న్యాయ పరిశీలన ద్వారా పారదర్శకత చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన సమయంలో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్.. చరిత్రాత్మకమైన చట్టాన్ని తీసుకు వచ్చామని అన్నారు. దేశ చరిత్రలోనే పారదర్శకత ఏపీ నుంచి మొదలు అవుతోందన్నారు. ఏపీ అవినీతికి దూరంగా ఉండే రాష్ట్రమనే సందేశం మన దేశానికే కాకుండా, అంతర్జాతీయ సమాజానికి కూడా వెళ్లాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ఇలా సాగుతుంది.. పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్లు దాటిన అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కమిషన్ పరిధిలోకి వస్తాయి. జడ్జి ఆ టెండర్‌కు సంబంధించిన పత్రాలను ప్రజలు, నిపుణుల పరిశీలనకు వారం రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో పెడతారు. ఇందుకు సంబంధించి జడ్జి టెక్నికల్ టీమ్ నుంచి సలహాలు, సూచనలు, వివరాలు పొందవచ్చు. సంబంధిత శాఖ జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా పాటించాల్సిందే. ఆ తర్వాత 8 రోజుల పాటు జడ్జి వాటిని పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందిస్తారు. ఈ విధానంలో మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదన ఖరారు అవుతుంది. ఆ తర్వాతే బిడ్డింగ్ ఎవరికీ అదనపు లబ్ధి చేకూర్చకుండా.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు అభించనున్నాయి. -
ఇది ఇక్కడితో ఆగిపోదు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే పారదర్శకతకు ఆంధ్రప్రదేశ్ వేదిక కానుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అవినీతిని నిర్మూలించి ప్రతి పనిలోనూ పారదర్శకత తీసుకురావాలన్నదే తమ ఉద్దేశమని ఆయన తెలిపారు. అవినీతిని నిరోధించడానికి, మరింత మెరుగైన పరిపాలన అందించడానికి ముందస్తు న్యాయ సమీక్ష బిల్లు తీసుకువస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఈ రోజు ఓ చారిత్రాత్మకమైన బిల్లును తీసుకువచ్చాం. దేశ చరిత్రలోనే పారదర్శకత ఏపీ నుంచి మొదలు అవుతోంది. వ్యవస్థలో మార్పు తీసుకు రావడానికి ఈ బిల్లు ఏ రకంగా ఉపయోగపడుతుందనేది సభ్యులు ఇప్పటికే సభలో చెప్పారు. గత ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసిన అవినీతి కనిపిస్తోంది. వ్యవస్థలో మార్పు రావాలంటే ముందుగా ఎవరైనా ప్రారంభిస్తేనే వస్తుంది. ముందస్తు న్యాయసమీక్ష అనేది ఇప్పటివరకూ దేశ చరిత్రలో ఎక్కడ జరుగలేదు. అది మన రాష్ట్రం నుంచే మొదలవుతుంది. పారదర్శకత అన్న పదానికి అర్థం ఇక్కడి నుంచి మొదలైతే దేశం మొత్తం వ్యాపిస్తుంది. దేశంలో ఎప్పుడు జరగని విధంగా.. అవినీతిని అంతమొందించేందుకు, వ్యవస్థలోకి పారదర్శకతను తీసుకురావాలని అడుగులు వేస్తున్నాం. చాలాసార్లు అవినీతికి వ్యతిరేకంగా నాయకులు మాట్లాడారు. నిజంగా ఏం చేస్తే అవినీతి లేకుండా చేస్తామన్నది ఎప్పుడు జరుగలేదు. నిజంగా పారదర్శకత అన్నదానికి అర్థం తెచ్చేందుకు ఈ బిల్లు తెచ్చాం. గత ఐదేళ్ల చంద్రబాబు పాలన గమనిస్తే..మనం కూర్చున్న ఈ బిల్డింగ్ గమనిస్తే స్కామ్ కనిపిస్తుంది. తాత్కాలిక భవనం కట్టడానికే అడుగుకు రూ.10 వేలు ఖర్చు అయిన పరిస్థితి చూశాం. ఏదీ తీసుకున్నా కూడా స్కామ్‌లమయమే. ఇలాంటి పరిస్థితి పూర్తిగా మారాలంటే ఈ బిల్లు ఏ రకంగా ఉపయోగపడుతుందన్నది నాకంటే ముందు మాట్లాడిన వారు చెప్పారు. ఈ బిల్లు ద్వారా రూ.100కోట్లు, దానికి పైబడిన ప్రతి టెండర్ ప్రభుత్వ టెండర్ ఏదైనా జడ్జి పరిధిలోకి వస్తుంది. టెండర్ల పరిశీలనకు హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు అవుతుంది. నియమించిన జడ్జి ఒక్కసారి బాధ్యతలు తీసుకున్న తరువాత ప్రభుత్వం పిలిచే ఏ టెండర్ అయినా సరే ఆ జడ్జి వద్దకు పంపిస్తాం. ఆ జడ్జి ఆ టెండర్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్లో వారం రోజుల పాటు పెడతాం. నేరుగా జడ్జికే సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. ఆ జడ్జి వద్ద టెక్నికల్‌గా తోడుగా ఉండేందుకు ఎవరినైనా కోరవచ్చు. జడ్జి వీళ్లు ఎవరూ వద్దు, ఫలాని వారు కావాలని కోరితే వారిని ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. జడ్జి టెండర్‌కు సంబంధించిన సలహాలు తన వద్ద ఉన్న టెక్నికల్ టీమ్‌తో చర్చిస్తారు. ఆ తరువాత జడ్జి సంబంధిత శాఖను పిలిచి తాను ఏదైతే సబబు అనుకుంటారో..వాటిని సూచిస్తూ మార్పులు చేస్తారు. అదే మార్పులు తూచా తప్పకుండా చేసిన తరువాతే టెండర్ డాక్యుమెంట్ పూర్తి చేస్తాం. ఇంత నిజాయితీగా, పారదర్శకంగా ఒక వ్యవస్థను తయారు చేయడం దేశ చరిత్రలో ఇప్పటివరకూ ఎక్కడా జరుగలేదు. ఏపీ నుంచే ఇది మొదలవుతుంది. ఇంత పారదర్శకంగా, నిజాయితీగా ఒక వ్యవస్థను సృష్టించి, వ్యవస్థ ద్వారా పారదర్శకత ఒక స్థాయి నుంచి మరోస్థాయికి తీసుకు వెళ్లడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే ఎక్కడా జరగలేదు. దీనివల్ల పూర్తిగా నమ్మకం, విశ్వాసం పెరుగుతాయి. ఇది ఇక్కడితో ఆగిపోదు, మిగిలిన రాష్ట్రాలు కూడా దీన్ని అనుసరిస్తాయి. ఇక్కడ మనం బీజం వేశాం. ఈ బీజం మహా వృక్షం అవుతుంది. దేశానికి దశ, దిశా చూపించే గొప్ప బిల్లు అవుతుందని గర్వంగా కూడా చెబుతున్నాను. ఇక లోకాయుక్తా బిల్లును కూడా ఇవాళ తీసుకువచ్చాం. గతంలో ఈ బిల్లు ఎందుకు లేదు అంటే దానికి సమాధానం లేదు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏపీలో లోకాయుక్తా అన్నది లేనే లేదు. అవినీతి లేకుండా ఉండాలని గత ప్రభుత్వం అనుకుని ఉంటే ఇది జరిగేది కాదు. కానీ ఆ ఆలోచన వారికి లేదు. చిన్న చిన్న మార్పులు చేస్తే ఇది జరిగి ఉండేది. లోకాయుక్తలో ఒక సిట్టింగ్ జడ్జి గాని, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఉంటేకాని లోకాయుక్తను నియమించలేమన్న నిబంధనను కాస్త మార్పు చేసి ఉంటే అయిదేళ్ల క్రితమే లోకాయుక్త వచ్చి ఉండేది. కానీ లోకాయుక్త అన్నది రానేరాకుండా, గత అయిదేళ్లుగా పెండింగ్‌లో పెట్టారంటే ఈ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారంలోకి వచ్చిన 45రోజుల్లోనే పారదర్శకత, వ్యవస్థలో మార్పు కోసం ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం గర్వంగా ఉంది.’ అని అన్నారు. కాగా లోకాయుక్తా, ముందస్తు న్యాయ సమీక్ష బిల్లులకు ఆమోదం అనంతరం శానససభ సోమవారానికి వాయిదా పడింది. -
ఆ మాట చెప్పిన ధైర్యమున్న నేత వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: పారదర్శకత లోపించినప్పుడు అపనమ్మకం, అభద్రతాభావం కలుగుతాయని బౌద్ధ గురువు దలైలామా అన్నారని, ప్రతి విషయంలో పారదర్శకత అత్యవసరమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. జ్యుడీషియల్ కమిషన్ బిల్లుపై జరిగిన అసెంబ్లీలో చర్చలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమ్మకముంచి ప్రజలు ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 86శాతం సీట్లు కట్టబెట్టారని, ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేరీతిలో ప్రజాసంక్షేమ, పారదర్శక పాలన కోసం సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అవినీతిలో మొదటిస్థానంలో ఉందని, ఇక, చంద్రబాబు తీసుకొచ్చిన ఓ జపాన్ సంస్థ సీఈవో ఆంధ్ర కంటే బిహార్ బెటర్ అని పేర్కొన్నారని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో జరిగిన అవినీతి ప్రపంచ దేశాల్లో మన రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు. చంద్రబాబు తన హయాంలో రూ. 65వేల కోట్లు రూపాయలు ప్రాజెక్టుల మీద వెచ్చించినట్టు చెప్పారని, కానీ, ఆ ప్రాజెక్టుల వద్దకు వెళితే.. నిర్మాణాలు కానీ, డ్యాములు కానీ లేవని, అక్కడ కనీసం సాగుచేసుకునే ఆయకట్టు కూడా పెరగలేదని అన్నారు. ప్రాజెక్టులేవీ కట్టకపోయినా రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్లకుపైగా చంద్రబాబు అప్పులపాలు చేశారని మండిపడ్డారు. తమ టీడీపీ నేతలు ఏం చేసినా అధికారులు చూసీచూడనట్టు ఉండాలని గతంలో చంద్రబాబు అంటే.. మొన్నటి కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో తప్పు చేసింది మా పార్టీ శాసనసభ్యుడైనా వదిలిపెట్టొద్దని చెప్పిన ధైర్యమున్న నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. నీతులు మాటల్లో కాదు చేతల్లో చూపించాలని, ఈ విషయంలో వైఎస్ జగన్ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశాన్ని మలుచుకుంటామని గత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంటే ఏదొ అనుకున్నానని, కానీ ప్రజలకు వచ్చిన ప్రతి కష్టాన్ని తమకు అవకాశంగా మార్చుకొని టీడీపీ ప్రభుత్వం దోచుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం జీవీఎంసీలో దోమలు ఆడవా-మగవా తెలుసుకోవడానికి చేపట్టిన కార్యక్రమాన్ని ప్రస్తావించి..నవ్వులు పూయించారు. చంద్రబాబు వద్ద పనిచేసిన ఇద్దరు చీఫ్ సెక్రటరీలు.. ఆయన పాలనలోని అవినీతిని బయటపెట్టారని, ఇది రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని పేర్కొన్నారు. అవినీతిని నివారించడానికి ముందుచూపుతో.. రాష్ట్ర సంపదని కాపాడటానికి తీసుకువస్తున్న జ్యుడీషియల్ కమిషన్ బిల్లు అందరికీ ఆదర్శం అవుతుందన్నారు. -
ప్రపంచ చరిత్రలోనే ఎవరూ చేయని సాహసం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో అవినీతికి తావులేకుండా, నీతివంతంగా, నిజాయితీగా పరిపాలన అందించేందుకు వీలుగా తీసుకువస్తున్న చరిత్రాత్మక చట్టం జ్యుడీషియల్ కమిషన్ బిల్లు అని వైఎస్సార్సీపీ సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు, పనులు అవినీతిపరులకు పాడి ఆవులుగా మారాయని, ఈ పరిస్థితిని మార్చేందుకే ఈ బిల్లును వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. జ్యుడీషిల్ కమిషన్ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రజలు కడుతున్న పన్నులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాలని, రాష్ట్రంలో నిజాయితీగా, స్వచ్ఛంగా పాలన జరగాలనే ముందుచూపుతో వైఎస్ జగన్ ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారని తెలిపారు. రూ. వందకోట్లు అంతకుమించిన ఉన్న ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు ఇకపై న్యాయమూర్తి ఆధ్వర్యంలో అందించబడతాయని, దీనిద్వారా ఎలాంటి తప్పునకు అవకాశమే ఉండదని తెలిపారు. గత ప్రభుత్వం నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చుకొని యథేచ్ఛగా దోపిడీకి పాల్పడిందని, దోపీడి దొంగల్లాగా ఈ రాష్ట్రాన్ని వారు లూటీ చేశారని అన్నారు. ఈ బిల్లుపై చర్చ జరిగే సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాన్ని చూడలేక సిగ్గుతోనే చంద్రబాబు ఈ సభలో లేకుండా పోయారని అన్నారు. ఈ బిల్లును చూసి చంద్రబాబు తట్టుకోవడం లేదన్నారు. 2014లో రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి రూ. 17,500 కోట్లు సరిపోతాయని చెప్పిన చంద్రబాబు.. తన ఐదేళ్ల హయాంలో రూ. 63వేల కోట్లు ప్రాజెక్టులపై వెచ్చించామని ఎన్నికల ప్రచారం స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. చంద్రబాబు తాను ఎంపిక చేసుకున్న వ్యక్తుల ద్వారా రాష్ట్రంలోని ప్రజాధనాన్ని జలగల్లా లూటీ చేశారని, వేలకోట్ల రూపాయల ధనాన్ని దారిదోపిడీగాళ్ల కంటే, చంబల్ లోయగాళ్ల కంటే భయకరంగా ఆంధ్రరాష్ట్రాన్ని అత్యాచారం చేసినంత దారుణంగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఈ చర్చలో పాల్గొంటే తన అవినీతి నగ్నస్వరూపం బట్టబయలు అవుతుందనే భయంతోనే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా సభలో లేరని విరుచుకుపడ్డారు. ఇక భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీకి తావులేకుండా వైఎస్ జగన్ చేస్తారనే భయంతోనే చంద్రబాబు పారిపోయాడని ఎద్దేవా చేశారు. పందికొక్కుల్లా ప్రజాధనాన్ని దోచుకున్న టీడీపీ నేతలు తమింకా పరిపాలనకు అర్హులని అనుకుంటున్నారని మండిపడ్డారు. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే అనేక భావజాలు, తాత్వికతలతో వచ్చిన ప్రభుత్వాలు చేయడానికి సాహసించని మహాత్తరమైన చర్య ఈ బిల్లు అని కొనియాడారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ పారదర్శకతను తీసుకొచ్చే ఈ బిల్లును ఏ ఒక్కరూ వ్యతిరేకించే అవకాశమే లేదన్నారు. వైఎస్సార్ అపర భగీరథుడిలా సంకల్పించి.. ప్రాజెక్టులను అతి తక్కువ ధరలో డిజైన్ చేయగా.. చంద్రబాబు ఆ ప్రాజెక్టుల వ్యయాన్ని కొన్ని పదులరెట్లు పెంచి.. దోపిడీకి దారులు తెరిచారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పద్ధతి ద్వారా గత చంద్రబాబు హయాంలో జరిగిన దోపిడీని, అవినీతిని కూడా వెలికితీయబోతున్నారని వివరించారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి పథకాలను మినహాయిస్తే.. చంద్రబాబు ప్రాజెక్టుల మీద ఖర్చు చేసిన మొత్తమంతా ఆయన బినామీలకు చేరిందన్నారు. గుడిని గుడిలోని లింగాన్ని కూడా మింగిన చరిత్ర చంద్రబాబు పాలనది అని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజాధనాన్ని కైంకర్యం చేయడాన్ని జ్యుడిషియల్ కమిషన్ బిల్లు చరమగీతం పాడతుందన్నారు. ఈ చట్టంతో అవినీతి, దందాగిరి చేసే అవకాశం ఇకపై ఉండబోదన్నారు. సీఎం వైఎస్ జగన్ ఒక సచ్ఛీలుడని, రాష్ట్రంలో నీతివంతమైనపాలన అందించాలని ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు కట్టిన పన్నులకు తాను బాధ్యతాయుతమైన కాపలాదారునని ఆయన నమ్ముతున్నారని, ఆయన తీసుకువస్తున్న చట్టాలతో రాష్ట్రంలో ఉన్నతమైన పాలన కొనసాగుతోందన్న విశ్వాసం, మనోధైర్యం రాష్ట్ర ప్రజల్లో కలుగుతోందని పేర్కొన్నారు. వందకోట్లకు మించి ఉన్న ఏ ప్రాజెక్టు అయినా, పని అయినా న్యాయమూర్తి ఆధ్వర్యంలో టెండర్ల పరిశీలన జరుగుతుందని, అంతేకాకుండా వారం రోజులపాట టెండర్ల అంశం ప్రజల మధ్య ఉంటుందని, టెండర్లకు సంబంధించిన ప్రతి అంశం ప్రజల ముందుకు వస్తుందని తెలిపారు. దీంతో ఏమాత్రం తప్పులకు అవకాశం ఉండదని, ఒక సంక్షేమ, అభ్యుదయ, అభివృద్ధికర ప్రభుత్వం అంటే ఇదీ అనే రీతిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సాహసోసేపతమైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ఈ చట్టం అవినీతిపరుల గుండెల్లో శరాఘాతమని, ఇక తప్పు చేయడానికి వీలులేకుండా ఉంటుందని అన్నారు. -
‘అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగు ఇది’
సాక్షి, అమరావతి : టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు శ్రీకారం చుట్టింది. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల హామీల అమలులో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును దేశ చరిత్రలోనే అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగుగా మంత్రివర్గం పేర్కొంది. టెండర్లలో పక్షపాతం, గందరగోళం, ప్రజా ధనం లూటీ, అవినీతి తదితర అంశాల అడ్డుకట్టకు ఈ విధానం తోడ్పడుతుందని వెల్లడించింది. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత, పారదర్శకతకు పెద్దపీట, హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో టెండర్ల పరిశీలన, అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యాలని మంత్రివర్గం పేర్కొంది. చట్టం బిల్లులో ప్రధాన అంశాలు: ముసాయిదా ప్రకారం.... ‘పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్ల దాటితే.. అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు హైకోర్టు జడ్జి లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి పరిధిలోకి తీసుకువస్తారు. అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనిని ప్రతిపాదిస్తున్న ప్రతీ శాఖ ఆ పత్రాలను జడ్జికి సమర్పించాల్సిందే. అదే విధంగా టెండర్లను పిలవడానికి ముందుగానే అన్ని పీపీపీ, జాయింట్‌వెంచర్లు, స్పెషల్ పర్సస్ వెహికల్స్ సహా అన్ని ప్రాజెక్టులను జడ్జి పరిశీలిస్తారు. ఈ విషయంలో జడ్జికి సహాయంగా ప్రభుత్వం పలువురు నిపుణులను నియమిస్తుంది. అవసరమైన నిపుణులను జడ్జి కూడా కోరవచ్చు. జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా సంబంధిత శాఖ పాటించాల్సిందే. కాగా తొలుత వారం రోజులపాటు ప్రజలు, నిపుణుల పరిశీలనకు ప్రజా బాహుళ్యంలోకి పనుల ప్రతిపాదనలు వస్తాయి. ఆ తర్వాత 8 రోజుల పాటు జడ్జి వాటిని పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందిస్తారు. ఈ క్రమంలో ఆయనకు సహకరించిన వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పిస్తుంది. ఈ విధానంలో మొత్తం 15 రోజుల్లో టెండర్ ప్రతిపాదన ఖరారు అవుతుంది. ఆ తర్వాతే బిడ్డింగ్ ఎవరికీ అదనపు లబ్ధి చేకూర్చకుండా.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి’ అని మంత్రివర్గం పేర్కొంది. ఇక ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా, పనిగట్టుకుని మరీ ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. దానిని నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేలా జడ్జికి అవకాశం కూడా ఉంటుందని వెల్లడించింది. జడ్జి, జడ్జి దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని పబ్లిక్ సర్వెంట్లుగా భావిస్తారు గనుక వారికి రక్షణ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని పేర్కొంది. -
వచ్చేవారం పార్లమెంటుకు ‘జ్యుడీషియల్’ బిల్లు
న్యూఢిల్లీ: జ్యుడీషియల్ నియామకాలలో పారదర్శకత లక్ష్యంగా రూపొందించే బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ బిల్లుపై పార్టీలో సంప్రదింపులు పూర్తయిన అనంతరం సభలో ప్రవేశపెట్టనున్నారు. బిల్లుపై అంతర్గత చర్చ ముగిసిన అనంతరం, బిల్లును కేబినెట్ ఆమోదానికి, ఆ తర్వాతి వారమే పార్లమెంటు ముందుకు పంపనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జడ్జీల సిఫార్సులతోనే జడ్జీలను నియమించేందుకు వీలుకలిగించే కొలీజియం వ్యవస్థను రద్దుచేయాలని పలువురు న్యాయకోవిదులు చెప్పడంతో జ్యుడీషియల్ నియామకాల బిల్లు వ్యవహారం మరింత వేగవంతమైంది. ఈ వారంలో అయితే, బడ్జెట్ కేటాయింపుల అనంతరం, బీమాబిల్లు, సెబీ బిల్లులను ప్రభుత్వం పార్లమెంటులో చేపట్టనుంది. జ్యుడీషియల్ సంస్కరణలపై సోమవారం జరిగిన భేటీలో కూడా కొలీజియం వ్యవస్థ పూర్తిగా మార్చాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. జ్యుడీషియల్ నియామకాలు మరింత పారదర్శకత అవసరమన్న అంశంపై ఏకాభిప్రాయం వ్యక్తమైందని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. -
న్యాయపీఠానికి సమన్యాయమేది?
జడ్జీల నియామకం తమ చేతుల్లోకి గుంజుకున్న న్యాయవ్యవస్థ, దానిని విడిచిపెట్టడానికి ఇష్టపడటం లేదు. పూర్తిగా జడ్జీల చేతుల్లో విడిచిపెట్టడం శ్రేయస్కరం కాదని, అలాగని పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టడమూ మంచిది కాదని జడ్జీల నియామకానికి సంబంధించి ఒక విధానం ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ జ్యుడీషియల్ కమిషన్ బిల్లు ప్రకారం ‘జ్యుడీషియల్ నియామకాల కమిషన్’ను ఏర్పాటు చేస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండడానికి శాసన విభాగం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ విభాగం మూడూ ముఖ్యమే. రాను రాను న్యాయ విభాగం ప్రధాన పాత్రను నిర్వహించడం మొదలు పెట్టింది. రాజ్యాంగంపైన, ఆ రాజ్యాంగబద్ధంగా చేసుకున్న చట్టాల పైన, వాటి అమలుపైన న్యాయ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగాన్ని అన్వయించటం, పాలన చట్టబద్ధంగా జరుగుతు న్నదా లేదా అనే అంశాలను చూసే పని న్యాయ విభాగం కోర్టులకు అప్పగించింది. ఆ పని న్యాయమూర్తుల చేత చేయిస్తుంది. అందు వల్ల న్యాయమూర్తుల పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంది. అయితే ఈ న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఎలా నియమిస్తారు? ఈ నియామకాలు, రాజ్యాంగ సూత్రాలు విలువల మీద ఆధారపడి ఉన్నట్టే రాజే న్యాయమూర్తి అయిపోయి, లేదా తన ఉద్యోగులను నియమించి న్యాయపరిపాలన చేసినట్టు ప్రజాస్వామ్య వ్యవస్థ లోనూ జరుగుతున్నదా? జడ్జీల నియామకం తీరు జడ్జీల నియామకానికి సంబంధించి రాజ్యాంగంలో ఒక పద్ధతి ఉంది. 124వ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిని గాని హైకోర్టు జడ్జిని గాని రాష్ట్రపతి నియమిస్తారు. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉన్న కొందరు జడ్జీలను సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి జడ్జీల నియామకం చేస్తారు. హైకోర్టు జడ్జీలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోను, రాష్ట్ర గవర్నరుతోను సంప్రదించి రాష్ట్రపతి జడ్జీలను నియమిస్తారు. ఈ పద్ధతి 1982 వరకు సాఫీగానే సాగింది. రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తితో, మరికొందరు న్యాయమూర్తులతో సంప్రదించి జడ్జీల నియామకం చేస్తారు. ‘సంప్రదించి’ అనే మాటను రాజ్యాంగం స్పష్టంగా వాడింది. 1982లో ఈ పద్ధతిని సవాలు చేశారు. సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీలు 4:3 మెజారిటీతో ఇంతవరకూ వస్తున్న ఆనవాయితీ, పద్ధతి రాజ్యాంగ బద్ధమే అని గుప్తా కేసులో తీర్పునిచ్చింది. అంటే జడ్జీలను నియమించే అధికారం ప్రభుత్వానికే ఇచ్చింది. అయితే ఈ తీర్పు చాలా దుమారం లేపింది. జడ్జీలను నియమించే అధికా రం ప్రభుత్వానికే ఇస్తే అది తన ఇష్టమొచ్చిన వాళ్లను, అధికార పార్టీకి అనువుగా ఉండే వాళ్లను నియమిస్తుంటుంది, కాబట్టి తీర్పుల్లో పక్షపాతం చూపుతుంది, నియామకాలు న్యాయసూత్రాల ప్రకారం జరిగే అవకాశం ఉండదని వాదిం చారు. 1991లో ముగ్గురు జడ్జీల ధర్మాసనం గుప్తా కేసును పునర్విచారణ చేయవ లసిన అవసరం ఉందని, విస్తృత ధర్మాసనానికి పంపించాలి అని తీర్పునిచ్చింది. దానితో తొమ్మిది మంది జడ్జీలతో ఒక ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. 1994లో ఈ ప్రత్యేక ధర్మాసనం 5:4 మెజారిటీతో సంచలనాత్మకమైన తీర్పుని చ్చింది. జడ్జీల నియామకంలో సుప్రీంకోర్టు, హైకోర్టులతో ‘సంప్రదించటం’ అనేది తప్పనిసరి అని చెప్పింది. ‘సంప్రదించటం’ అంటే ‘సమ్మతి’కాదు అని 1982లో సుప్రీంకోర్టు చెప్పినా 1994లో మాత్రం ‘సమ్మతి’ కిందనే జమ కట్టింది. అయితే ఒక పద్ధతి రూపొందించింది. జడ్జీల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మరో నలుగురు సీనియర్ జడ్జీలను కలిపి ఒక ‘కొలీజియం’ (ఒక చిన్న ఉపసంఘం లాంటిది)ను ఏర్పరచి దాని అభిప్రాయం మేరకు నియా మకాలు జరగాలని తీర్పునిచ్చింది. ఈ సంప్రదింపులలోగాని సమ్మతిలోగాని ప్రభుత్వ ప్రమేయం ఏమీ ఉండదు. జడ్జీలను ఈ కొలీజియం ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్రపతి సంతకం చేయవలసిందే. అంటే జడ్జీల నియా మకంలో ఒక కొత్త ఒరవడి పెట్టింది. ఇదే నిర్ణయాన్ని మరొకసారి 1998లో తొమ్మిది మంది జడ్జీలు ధ్రువీకరించారు. అంటే ఇప్పుడు జడ్జీలను జడ్జీలే ఎంపిక చేస్తారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయవలసిందే. కొత్త పద్ధతికి ప్రయత్నం ఇటువంటి పద్ధతి ఏ దేశంలోనూ లేదు. మనం సంప్రదాయంగా స్వీకరించిన బ్రిటిష్ న్యాయవ్యవస్థలో కూడా జడ్జీలను జడ్జీలే ఎంపిక చేసుకోరు. మనం అబ్బురపడి అనుకరించటానికి ఉబలాటపడే అమెరికా న్యాయవ్యవస్థలో కూడా ఇలాంటి పద్ధతి లేదు. విచిత్రమేమంటే జడ్జీల నియామకం ప్రభుత్వం చేతు ల్లోంచి లాక్కొని, తమ చేతుల్లో పెట్టకుంటే, అది రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాం గంలోని ఆర్టికల్స్ 124, 217కి పూర్తి విరుద్ధమని చెప్పటానికి ప్రభుత్వం సాహసిం చలేదు. రాజ్యాంగాన్ని అన్వయించటమే సుప్రీంకోర్టు చేయవలసిన పని గాని, దానిని మార్చే అధికారం కోర్టుకు లేదనే సాధారణ విషయం కూడా ప్రభుత్వానికి తట్టలేదు. మూడు తీర్పుల్లోను కొంత లోటు ఉన్నదని గ్రహించి ప్రభుత్వం జడ్జీల నియామకానికి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నది. ‘జ్యుడీషియల్ నియామకాల కమిషన్’ పేరు మీద 2013లో ఒక బిల్లును రాజ్య సభలో ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్లుపై న్యాయవాదుల నుంచి న్యాయ నిపు ణుల నుంచి రాజకీయ నాయకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది. జడ్జీల నియామకం తమ చేతుల్లోకి గుంజుకున్న న్యాయవ్యవస్థ, దానిని విడిచి పెట్టడానికి ఇష్టపడటం లేదు. పూర్తిగా జడ్జీల చేతుల్లో విడిచిపెట్టడం శ్రేయస్కరం కాదని, అలాగని పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టడమూ మంచిది కాదని జడ్జీల నియామకానికి సంబంధించి ఒక విధానం ఈ బిల్లులో ప్రతిపాదించారు. ఈ జ్యుడీషియల్ కమిషన్ బిల్లు ప్రకారం ‘జ్యుడీషియల్ నియామకాల కమిషన్’ను ఏర్పాటు చేస్తారు. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షులు. ఆయన తర్వాత వచ్చే ఇద్దరు సీనియర్ జడ్జీలు పదవి రీత్యా సభ్యులుగా ఉంటారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి మరో సభ్యుడు. మరో ఇద్దరు ‘ప్రసిద్ధ వ్యక్తులను’ భారత ప్రధాన మంత్రి, ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు కలిసిన బృందం సిఫారసు చేస్తుంది. ఈ ఇద్దరు ప్రసిద్ధులు మూడేళ్లపాటు మాత్రమే సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ ప్రమేయం తగ్గించేందుకే ఈ ఏర్పాటుపైన కూడా వ్యతిరేకత వచ్చింది. ‘ఇద్దరు ప్రసిద్ధ వ్యక్తులు’ అనగానే మళ్లీ ప్రభుత్వ పక్షాన ఉండే వారిని నియమించుకుంటారన్నది అభ్యంతరం. ఈ అభ్యంతరాలన్నీ న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వ పాత్రను లేకుండా చేయటానికే! ప్రభుత్వ పాత్ర ఉన్నదంటే ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఆశ ఏమీ మిగలదు. ఒకప్పుడు న్యాయవ్యవస్థ నియామకాలన్నీ అగ్రకులాలకే దక్కేవి. మెజారిటీ ప్రజలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాతినిధ్యం ఉండేది కాదు. ఈ కులాల వాళ్లు తీవ్రమైన పోరాటాలు చేస్తే ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని ప్రాతినిధ్యం లేని కులాలకు కొంతలో కొంత ప్రాతినిధ్యం ఇవ్వటం మొదలు పెట్టింది. న్యాయవ్యవస్థలో ప్రజాస్వామ్యం ఉండాలంటే అన్ని వర్గాలకూ ప్రాతి నిధ్యం ఉండాలి. ఒకప్పుడు భారతదేశంలో జడ్జీలు అందరూ అగ్రకులాలకు చెం దిన వాళ్లే, అందులో ముఖ్యంగా బ్రాహ్మణ కులానికి చెందిన వారే. రిజర్వేషన్ పద్ధతి ప్రవేశపెడితేనే గానీ ఎస్సీ, ఎస్టీ బీసీ వర్గాలకు న్యాయం జరగదని ఆందోళనచేస్తే ‘న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ ఏమిటని’ వెక్కిరిస్తున్నారు. ఏమన్నా అంటే ‘మెరిట్’ అంటారు. మెరిట్ అనేది కొన్ని కులాలకే గుత్త అని వాళ్ల ఉద్దేశం. అది సరికాదని ఎన్నోసార్లు రుజువవుతూ వచ్చింది. ప్రజాస్వామిక విలువలు ప్రవేశపెడితే నిజమైన ప్రాతినిధ్యం వస్తుందనే విషయం గుర్తించటం లేదు. అమెరికాలో ఉన్నది ఇదే ఈ విధానం అమెరికా, బ్రిటన్ దేశాలలో అమలు చేస్తున్నారు. మరి ఇక్కడే మొచ్చింది? రాజ్యాంగ సూత్రాల ప్రకారం, భారతదేశ సామాజిక అవసరాలను బట్టి వివిధ తరగతులకు అవకాశం కల్పించవలసిన ప్రాధాన్యాన్ని గుర్తించి, న్యాయమూర్తుల నియామకాన్ని ప్రజాస్వామ్యీకరిస్తే దేశానికి శ్రేయస్కరం. ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసి సక్రమమైన పద్ధతిలో నియామక వ్యవస్థను రూపొం దిస్తే మంచి పరిణామాలు వస్తాయి. ప్రజాస్వామిక వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండే పద్ధతితో కొత్త విధానాన్ని రూపొందించి న్యాయవ్య వస్థను ఫ్యూడల్ పగ్గాలలో నుంచి విముక్తం చేయడమే ఇప్పుడు జరగవలసిన అసలు పని.