
న్యూఢిల్లీ: భారతదేశపు తొలి లోక్‌పాల్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్ర ఘోష్ (పీసీ ఘోష్) మంగళవారం నియమితులయ్యారు. సశస్త్ర సీమా బల్ మాజీ చీఫ్ అర్చనా రామసుందరం, మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ జైన్, మహేంద్ర సింగ్, ఇంద్రజిత్ ప్రసాద్ గౌతమ్‌లు లోక్‌పాల్ కమిటీలో న్యాయేతర సభ్యులుగా ఉండనున్నారు. లోక్‌పాల్‌లో నియామకం కోసం వీరందరి పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సిఫారసు చేయగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. అవినీతిపై పోరు కోసం కేంద్రం లోక్‌పాల్‌ను తీసుకొస్తుండటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment