అత్యాచారం, హత్య, దోపిడీ.. మసకబారుతున్న బాల్యం
దిగజారుతున్న శాంతిభద్రతలకు, నైతిక విలువలకు ఈ ప్రభుత్వ నివేదిక ఓ హెచ్చరిక లాంటింది. అత్యాచారం, హత్య వంటి నేరాల్లో పాల్గొంటున్న బాలుర సంఖ్య క్రమేణా పెరుగుతోంది. జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) డేటాలో విస్తుగొలిపే విషయాలు వెలుగుచూశాయి. మహిళా శిశుసంక్షేమ శాఖ చట్టాలను సవరించాల్సిన ఆవవ్యకతను తెలియజేసింది.
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం 2002లో దేశంలో 485 మంది బాలురకు అత్యాచార కేసుల్లో ప్రమేయం ఉండగా, 2012లో 1175 మందిపై కేసులు నమోదయ్యాడు. ఇక 2002లో 531 మంది బాలురను హత్య కేసుల్లో అరెస్ట్ చేయగా.. గతేడాది ఆ సంఖ్య 990కు పెరిగింది.ఇళ్లకు కన్నాలు వేయడం, దారిదోపిడీలు, కిడ్నాప్ వంటి కేసుల్లో అరెస్టవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే విషయం. హత్యాయత్నం, చీటింగ్, దౌర్జన్యం వంటి కేసులు కూడా క్రమేణా పెరుగుతున్నాయి. బాలనేరస్తుల సంఖ్య పెరగడానికి వారి సామాజిక, ఆర్థిక నేపథ్యం, మానసిక స్థితి కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.