142కు చేరిన మృతుల సంఖ్య | Kanpur Train Tragedy death toll rises to 133: IG (Kanpur range) Zaki Ahmad | Sakshi
Sakshi News home page

142కు చేరిన మృతుల సంఖ్య

Published Mon, Nov 21 2016 10:55 AM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

142కు చేరిన మృతుల సంఖ్య - Sakshi

142కు చేరిన మృతుల సంఖ్య

పుఖ్రయా (కాన్పూర్): ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రయా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 142కు చేరింది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ నిర్వహణ లోపం ఫలితంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు.

యూపీ పోలీసులు, రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం, రెండు బోగీలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోవటంతో చాలావరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారాయి. దీంతో మృతులకు గుర్తించడం కష్టంగా మారింది. ఇంకా కొంత మంది బోగీల కింద చిక్కుపోయారు. వీరిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదం నుంచి బయటపడిన వారు సమీపంలోని పట్టణాలకు వెళ్లి బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.

కాగా, ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో నేడు రైల్వే మంత్రి సురేశ్‌ ప్రభు ప్రకటన చేయనున్నారు.

ప్రాథమిక వార్త: ఘోర రైలు ప్రమాదం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement