Indore-Patna express train
-
‘కాన్పూర్ రైలు’ మృతులు 146
-
‘కాన్పూర్ రైలు’ మృతులు 146
- 83 మందికి కొనసాగుతున్న చికిత్స - ప్రమాదంపై రైల్వే విచారణ షురూ - వేగంగా పాత బోగీల తొలగింపు: మంత్రి సురేశ్ ప్రభు పుఖ్రాయా(యూపీ): ఇండోర్-పట్నా రైలు ప్రమాద మృతుల సంఖ్య సోమవారం 146కు పెరిగిందని కాన్పూర్ రేంజ్ ఐజీ జకీ అహ్మద్ చెప్పారు. గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 79 మంది పరిస్థతి విషమంగా ఉందని తెలిపారు. కాన్పూరు సమీపంలో పట్టాలు తప్పిన 14 రైలు బోగీలను తొలగించారు. సుమారు 133 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందించినట్లు కాన్పూర్ ముఖ్య ఆరోగ్యాధికారి రామాయణ్ ప్రసాద్ వెల్లడించారు. 24 శరీరాలను బిహార్‌కు, 25 మధ్యప్రదేశ్‌కు, 56 మృతదేహాలను ఉత్తరప్రదేశ్‌కు పంపినట్లు చెప్పారు. గాయపడిన 202 మందిలో 83 మందికి కాన్పూర్‌లో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. రైలు ప్రమాదానికి కారణం తెలుసుకునేందుకు రైల్వే భద్రతా కమిషనర్(తూర్పు సర్కిల్) పీకే ఆచార్య నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. సోమవారం ఆయన ప్రమాదం జరిగిన చోటును సందర్శించి విరిగిన పట్టాలు, దెబ్బతిన్న బోగీలను పరిశీలించి వీడియో తీశారు. బాధ్యులకు కఠిన శిక్ష : సురేశ్ ప్రభు కాన్పూర్ సమీపంలో ఆదివారం రైలు ప్రమాదానికి కారకులైన వారికి కఠిన శిక్ష తప్పదని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు హెచ్చరించారు. ఈ దుర్ఘటనపై అధునాతన సాంకేతికత, ఫోరెన్సిక్ విశ్లేషణల సాయంతో ప్రత్యేకంగా విచారణ జరిపిస్తామని ఆయన సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. గత రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా ప్రమాదాలను తట్టుకోలేని పాత బోగీలను తొలగించే ప్రక్రియను త్వరితగతిన చేపడతామని చెప్పారు. సహాయ మంత్రి ప్రకటనపై రాజ్యసభలో అభ్యంతరం రైలు ప్రమాదంపై రాజ్యసభలో రైల్వే సహాయ మంత్రి రాజెన్ గొహెరుున్ ప్రకటన చేయగా ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశారుు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుయే దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేశారుు. గొహెరుున్ కేబినెట్ మంత్రి కారని, లోక్‌సభలో రైల్వే మంత్రి ప్రకటన చేసి రాజ్యసభకు సమాధానం ఇవ్వకపోవడం సభను అగౌరవపరచడమేనని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ విమర్శించారు. కుటుంబాన్ని కాపాడిన చేతి కర్ర ఇండోర్-పట్నా రైలు ప్రమాదం జరిగిన సమయంలో ఓ వృద్ధురాలి చేతికర్ర కుటుంబంలోని ఏడుగురిని కాపాడింది. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ చౌరాసియా కుటుంబం పట్నాకు బయల్దేరుతూ ఇండోర్‌లో రెలైక్కింది. ప్రమాదం జరిగిన తరువాత తామంతా బీఎస్1 బోగీలో చిక్కుకున్నామని తన తల్లి చేతికర్రే తమను కాపాడిందని చౌరాసియా చెప్పారు. ఆ కర్ర సాయంతో కిటికీ తలుపులు పగలగొట్టి గంట తరువాత సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. తమ బోగీలోని సహాయకుడు, మరి కొందరు ప్రయాణికులు చనిపోగా మృత్యువు తమకు అతి సమీపం నుంచి వెళ్లిందని చౌరాసియా భార్య నందిని చెప్పారు. -
రైలు ప్రమాదం: బీమా అందేది ఎందరికి?
ఇండోర్- పట్నా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మరణించిన వారి వారసుల్లో చాలామందికి రైల్వేశాఖ ఇటీవల ప్రవేశపెట్టిన బీమా పథకంలో సొమ్ము అందే అవకాశాలు కష్టమని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 145 మంది మరణించగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. రైల్వే శాఖ ఇటీవల చేపట్టిన పథకంలో భాగంగా.. రైలు టికెట్ బుక్ చేసుకునేటప్పుడే 92 పైసల ప్రీమియం కడితే.. ప్రయాణంలో ఏదైనా ప్రమాదం సంభవించి ప్రయాణికుడు మరణించినా, శాశ్వత అంగవైకల్యం పొందినా వాళ్ల వారసులకు రూ. 10 లక్షల మొత్తం బీమా రూపంలో అందుతుంది. అయితే.. ఇందుకోసం ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నామినీ సదుపాయాన్ని కూడా ఉపయోగించుకోవాలి. టికెట్ బుక్ చేసుకున్న వెంటనే తాము చాలాసార్లు ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు పంపుతామని.. అయినా కూడా దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోకుండా నామినేషన్ విషయాన్ని చాలామంది పట్టించుకలేదని శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నతాధికారి జగన్నాథన్ అన్నామలై చెప్పారు. బీమా క్లెయిమ్ విషయంలో నామినీ లేనప్పుడు బీమా సంస్థలు 'లీగల్ హెయిర్ సర్టిఫికెట్' అడుగుతాయి. దాన్ని స్థానిక ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందుకు చాలా తతంగమే ఉంటుంది. కేవలం 92 పైసల ప్రీమియం కడుతుండటంతో చాలామంది నామినీ పేరు రాయాలన్న విషయాన్ని పట్టించుకోరని.. అదే ఇప్పుడు క్లెయిములు సెటిల్ చేయడంలో పెద్ద అడ్డంకి అవుతుందని చెప్పారు. పైగా, ఈ రైల్వే బీమా విషయంలో ప్రమాదం జరిగిన నాలుగు నెలల్లోగానే క్లెయిమ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లెయిమ్‌కు వెళ్లినా ప్రయోజనం ఉండదు. (92 పైసలకే రూ.10 లక్షల బీమా) ప్రమాదానికి గురైన రైలులో మొత్తం 695 మంది ప్రయాణికులు రిజర్వేషన్ కంపార్టుమెంట్లలో ప్రయాణిస్తున్నారని భారతీయ రైల్వేల సీపీఆర్వో అనిల్ సక్సేనా తెలిపారు. వాళ్లలో కేవలం 128 మంది మాత్రమే టికెట్ బుకింగ్ సమయంలో బీమా కావాలని, దాని ప్రీమియం కట్టారు. వారిలో 78 మంది ప్రమాద సమయానికి రైల్లోనే ఉన్నారు. మిగిలిన వారు తర్వాత స్టేషన్లలో ఎక్కాల్సి ఉంది. అయితే.. మృతుల్లో ఇలా బీమా ప్రీమియం కట్టినవాళ్లు ఎంతమంది అనే విషయం కూడా ఇంకా లెక్కతీయాల్సి ఉంది. (రైలు టికెట్‌తోపాటే బీమా.. అనూహ్య స్పందన) అయితే.. నామినీ లేనంత మాత్రాన బీమా కంపెనీలు వారసులకు డబ్బు ఇవ్వబోమంటే ప్రభుత్వం ఒప్పుకొనే పరిస్థితి ఉండదు. ఉన్నతాధికారులు కూడా జోక్యం చేసుకుని ప్రీమియం కట్టినవారిలో మృతులుంటే వారందరికీ వీలైనంత త్వరలోనే బీమా సొమ్ము ఇప్పించే ప్రయత్నం చేస్తారు. నామినీ పేరు రాయని వాళ్లకు కొంత ఆలస్యం కావచ్చు గానీ.. అసలు అందకపోయే ప్రసక్తి ఉండదని ఐఆర్సీటీసీ ఉన్నతాధికారులు చెప్పారు. ఇక నుంచి ప్రమాద బీమాను ఐచ్ఛికం కాకుండా తప్పనిసరి చేయాలన్న ప్రతిపాదనలు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అలాగే, బీమా ప్రీమియం కడుతున్నప్పుడే నామినీ పేరు కూడా రాయించాలని చెబుతున్నారు. 92 పైసలు ప్రీమియం కట్టిన తర్వాత.. ప్రయాణంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ. 10 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యం సంభవిస్తే రూ. 7.5 లక్షలు, ఆస్పత్రి పాలైతే రూ. 2 లక్షలు, మృతదేహం తరలింపు ఖర్చుల కింద రూ. 10వేలు చెల్లిస్తారు. -
ఈ రైలు ప్రమాదానికి ఎవరు బాధ్యులు?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఇండోర్-పట్నా ఎక్స్ప్రెస్రైలు ప్రమాదంలో దాదాపు 145 మంది ప్రయాణికులు మరణించడానికి కారణం ఏమిటీ? అందుకు బాధ్యులెవరు? రైలు పట్టాలపై పగుళ్లు ఏర్పడడం వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రైలు పట్టాల నిర్వహణ బాధ్యత చూస్తున్న రైల్వే భద్రతా విభాగం ఏం చేస్తుంది? గంటకు 160 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లను ప్రవేశపెడతామని కేంద్ర రైల్వే శాఖ ఘనంగా చెబుతోంది. అవి కూడా ఈ పట్టాలపై నుంచే దూసుకుపోతే జరగబోయే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో ఉన్నతాధికారులు ఊహించలేరా? గత మూడేళ్ల కాలంలో .జరిగిన రైలు ప్రమాదాల్లో 50 శాతం ప్రమాదాలు పట్టాలు తప్పడం వల్లనే జరిగాయి. వాటిలో 29 శాతం ప్రమాదాలు పట్టాలపై పగుళ్లు ఏర్పడడం కార ణంగానే జరిగాయి. ఈ ఒక్క ఏడాదే, అంటే నవంబర్ 15వ తేదీ వరకు సంభవించిన మొత్తం రైలు ప్రమాదాల్లో 67 శాతం ప్రమాదాలు పట్టాలు తప్పడం వల్ల జరిగాయి. రైలు పట్టాలు సవ్యంగా ఉన్నాయా, లేవా అన్నది ఎప్పటికప్పుడు తనీఖీ చేయాల్సిన బాధ్యత ‘ట్రాక్ సేఫ్టీ’ విభాగానిది. పట్టాలను తనిఖీ చేస్తూ వెళ్లి రైల్వే ఉద్యోగులను ‘గ్యాంగ్‌మెన్’ అని పిలుస్తారని తెల్సిందే. 15 కిలోల బరువుతో ఐదు కిలోమీటర్లు ఒక్కో గ్యాంగ్‌మేన్ రోజుకు ఐదు కిలోమీటర్లు కాలి నడకన వెళ్లి పట్టాలను తనిఖీ చేయాలి. తనిఖీకి అవసరమైన పరికరాలు 15 కిలోల బరువు ఉంటాయి. వాటిన భుజాన స్వయంగా మోసుకొని వెళ్లాలి. మరమ్మతు చేయడం తన వల్లయితే చేయాలి. లేదంటూ సంబంధిత ఇంజనీరును అలెర్ట్ చేయాలి. ఇలా దేశంలోని 11,5,000 కిలోమీటర్ల రైలు పట్టాలను గ్యాంగ్‌మెన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సి ఉంటుంది. రైల్వే శాఖలో ప్రస్తుతం రెండు లక్షల మంది గ్యాంగ్‌మెన్ ఉన్నారు. లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వీటిని నింపేందుకు రైల్వే శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గ్యాంగ్మేన్ల బరువును తగ్గించే ఆధునిక పరికరాలను తెప్పించడం లేదు. ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తున్న పరికరాలకే గ్యాంగ్మెన్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ‘అల్ట్రాసోనిక్ ఫ్లా డిటెక్షన్ మిషన్లు’ వాడుతున్నారుగానీ, వాటిని కూడా గ్యాంగ్మెన్లే మోసుకెళ్లాలి. వీటిని రెండు నెలలకు ఓసారి మాత్రమే రద్దీ ఎక్కువగా ఉన్న ట్రాక్‌లపై ఉపయోగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి డ్యూటీ పట్టాలపైనే. అత్యవసర సమయాల్లో ఎప్పుడుపడితే అప్పుడు డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వారి ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. వారి వల్ల ఎక్కువ ఒత్తిడి ఉండడం కూడా కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతోంది. ఎక్కువ రైళ్లు వెళ్లడం, అందులో ఎక్కువ బరువుగల రైళ్లు వెళ్లడం వల్ల పట్టాల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయని ‘ఇండియన్ రైల్వేస్ లోకో రన్నింగేమేన్ ఆర్గనైజేషన్’కు చెందిన ఆఫీస్ బేరర్ సంజయ్ పాంఢీ తెలిపారు. రైలు పట్టాలపై పగుళ్లను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం మద్రాస్ ఐఐటీతో రైల్వే శాఖ కలసి కృషి చేస్తోంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం రాలేదు. ట్రాక్‌ను పర్యవేక్షించే సాఫ్ట్వేర్ ఏమైంది? ట్రాక్‌ను పర్యవే క్షించే సాఫ్ట్వేర్ వ్యవస్థను కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఈ ఏడాది మొదట్లో ప్రవేశపెట్టారు. అయితే రైల్వే భద్రతా విభాగానికి ప్రధానంగా అందుబాటులో ఉండాల్సిన ఈ వ్యవస్థ గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, దాన్ని ఎందుకు రహస్యంగా ఉంచుతున్నారో అర్థం కావడం లేదని ఆ విభాగానికి చెందిన పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి తెలిపారు. రైళ్లు వెళ్లినప్పుడు పట్టాలపై ఏర్పడే చిన్న చిన్న పగుళ్లు ఆ తర్వాత ఓ రోజులో ఉష్ణోగ్రతల మధ్య ఎక్కువ, తక్కువ వ్యత్యాసాలు ఉన్నప్పుడు, సంకోచ, వ్యాకోచాల కారణంగా పెద్దగా మారుతాయి. కొన్ని సార్లు పట్టాల నట్లు గట్టిగా భిగించినప్పుడు లేదా రైలు ట్రాక్‌లను మార్చినప్పుడు కూడా ఇలాంటి పగుళ్లు ఏర్పడుతాయి. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సరైన వ్యవస్థ, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసే ఆధునిక పరికరాలు లేకపోతే పట్టాలు తప్పే ప్రమాదాలు ఎప్పటికీ ఆగిపోవు. భారత పట్టాలపై బుల్లెట్ రైళ్లను పరుగెత్తించాలని వాంఛిస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టాల భద్రతకు ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో? -
142కు చేరిన మృతుల సంఖ్య
పుఖ్రయా (కాన్పూర్): ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రయా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 142కు చేరింది. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ నిర్వహణ లోపం ఫలితంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. యూపీ పోలీసులు, రైల్వే సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం, రెండు బోగీలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోవటంతో చాలావరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారాయి. దీంతో మృతులకు గుర్తించడం కష్టంగా మారింది. ఇంకా కొంత మంది బోగీల కింద చిక్కుపోయారు. వీరిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రమాదం నుంచి బయటపడిన వారు సమీపంలోని పట్టణాలకు వెళ్లి బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. కాగా, ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంపై పార్లమెంట్ ఉభయ సభల్లో నేడు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటన చేయనున్నారు. ప్రాథమిక వార్త: ఘోర రైలు ప్రమాదం -
ఘోర రైలు ప్రమాదం: 120 మందికిపైగా మృతి
-
ఘోర రైలు ప్రమాదం
యూపీలో రైలు ప్రమాదంలో 120 మందికిపైగా మృతి - కాన్పూర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘటన - పట్టాలు తప్పిన ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్‌లోని 14 బోగీలు - 200 మందికి పైగా తీవ్రమైన గాయాలు.. పలువురి పరిస్థితి విషమం - ప్రమాదానికి 9 నిమిషాల ముందు అదే ట్రాక్‌లో ప్రయాణించిన సబర్మతీ ఎక్స్‌ప్రెస్ యూపీ రైలు ప్రమాదం ప్రయాణికులను ఓ కుదుపు కుదిపింది. ఆదమరిచి నిద్రిస్తున్న వారిని శాశ్వత నిద్రలోకి నెట్టేసింది. చిమ్మ చీకట్లో జరిగిన ప్రమాదం మృతుల కుటుంబాల్లో చీకటి నింపింది. అప్పటి వరకు పక్కనే నిద్రిస్తున్నవారి జాడ దొరకని పరిస్థితి. నుజ్జునుజ్జరుున బోగీల్లో గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు.. పెళ్లి కోసం ఒకరు.. పెళ్లి పనుల కోసం మరొకరు.. తమవారి కోసం రైలు, ఆసుపత్రుల వద్ద వెతుకులాట కంటతడి పెట్టిస్తుంటే.. చావును దగ్గర్నుంచి చూశామని ఒకరు.. ఇలాంటి ప్రమాదాన్ని ఎప్పుడూ చూడలేదని మరొకరు. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో విషాదగాథ. గ్యాస్ కట్టర్లతో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, రైల్వే బలగాలు తీవ్రంగా ప్రయత్నించి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది. పుఖ్రయా (కాన్పూర్): ఉత్తరప్రదేశ్‌లోని పుఖ్రయా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి బయలుదేరిన ‘ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్’ కాన్పూర్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 120 మందికి పైగా మృత్యువాత పడగా.. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సగం మంది పరిస్థితి విషమంగా ఉందని రైల్వే అధికారులు వెల్లడించారు. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో పరిస్థితి హృదయ విదారకంగా ఉంది. అక్కడక్కడ తెగిపడిన శరీర భాగాలతో ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు స్థానికులను, మృతుల బంధువులను కన్నీరు పెట్టించారుు. ప్రమాదం సంగతి తెలియగానే రైల్వే, యూపీ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో.. ప్రమాదం గురించి తెలియగానే రైల్వే శాఖ, యూపీ ప్రభుత్వాలు వెంటనే రంగంలోకి దిగారుు. కేంద్రం 5 ఎన్డీఆర్ఎఫ్ బలగాలను రంగంలోకి దించింది. చిమ్మచీకట్లో ఘటన జరగటంతో సహాయక కార్యక్రమాలు కాస్త ఆలస్యమయ్యారుు. తెల్లవారిన తర్వాత గ్యాస్ కట్టర్ల సాయంతో బోగీలను కోసి మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు తీశారు. ఆర్మీ డాక్టర్లు, రైల్వే అధికారులు యూపీ ప్రభుత్వ వైద్యులు క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సచేసి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సాయంత్రం వరకు 120 మృతదేహాలను బోగీలనుంచి బయటకు తీసినట్లు కాన్పూర్ రేంజ్ ఐజీ జాకీ అహ్మద్ తెలిపారు. ఇందులో కేవలం 43 మందిని మాత్రమే గుర్తించగలిగారు. ఇందులో 27 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేసి బంధువులకు అప్పగించారు. మృతుల్లో బిహార్‌కు చెందిన ఇద్దరు జవాన్లు ప్రభు నారాయణ్ సింగ్, అనిల్ కిషోర్, యూపీ పోలీసు కానిస్టేబుల్ లఖన్ సింగ్ ఉన్నారు. ఎస్1, ఎస్2 బోగీల్లోని టికెట్ కలెక్టర్ల ఆచూకీ లభించలేదు. క్షతగాత్రులను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ పరామర్శించారు. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా (పీఎంఆర్ఎఫ్ నుంచి) ప్రకటించారు. అటు సురేశ్ ప్రభు కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే శాఖ తరపున మృతుల కుటుంబాలకు రూ.3.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. యూపీ సీఎం అఖిలేశ్ కుమార్ కూడా మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు తెలిపారు. గుర్తుపట్టలేనంతగా: ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు 56 మందిని ప్రాణాలతో కాపాడగలిగారుు. ఇద్దరు చిన్నారులుసహా మొత్తం 16 మంది ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటం, రెండు బోగీలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోవటంతో చాలావరకు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా మారాయని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెల్లడించారుు. ఇప్పటివరకు క్షతగాత్రులందరిని బయటకు తీసుకొచ్చామని.. లోపల ఉండే వారు బతికే అవకాశాల్లేవని స్పష్టం చేశారు. కోల్డ్ కట్టర్ల సాయంతో బోగీలను కట్ చేస్తున్నట్లు తెలిపారు. చావును దగ్గర్నుంచి చూశాం యూపీ రైలు దుర్ఘటననుంచి ప్రాణాలు కాపాడుకున్నవారు ఇంకా భయంతో వణికిపోతున్నారు. చావును దగ్గర్నుంచి చూశామని బాధితులు తెలిపారు. ‘మంచి నిద్రలో ఉన్నాం ఒక్కసారిగా భయంకరమైన కుదుపునకు సీట్లలోనుంచి కిందపడ్డాం. అంతలోనే భయంకరమైన శబ్దం వచ్చింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే హాహాకారాలు, ఆర్తనాదాలు మొదలయ్యారుు. అతికష్టం మీద బోగీల్లోనుంచి బయటకొచ్చాం’ అని క్షతగాత్రుడొకరు తెలిపారు. ‘మా జీవితంలో ఇంతటి ప్రమాదాన్ని ఎప్పుడూ చూడలేదు. మావాళ్లు ఐదుగురి కోసం ఇంకా వెతుకుతున్నాం’ అని దీపికా త్రిపాఠి అనే ప్రయాణికురాలు తెలిపారు. ‘మాకు స్వల్ప గాయాలయ్యారుు. పట్టాలు తప్పిన బోగీలనుంచి బయటకు రావటం చాలా కష్టమైంది. టారుులెట్ ద్వారం గుండా బయటకు వచ్చాం’ అని మరో ప్రయాణికుడు తెలిపారు. ప్రమాదానికి గురైన నాలుగు బోగీల్లోని తమవారి ఆచూకీ కోసం ఘటనా స్థలం, ఆసుపత్రుల వద్ద బంధువులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎల్‌హెచ్‌బీ ఉండుంటే.. రైలు బోగీలు ‘లింక్ హాఫ్మాన్ బుష్’ (ఎల్‌హెచ్‌బీ)తో తయారుచేసినవి కాకపోవటం వల్లే దుర్ఘటన తీవ్రత ఎక్కువగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. స్టెరుున్ లెస్ స్టీల్‌తో తయారైన ఈ ఎల్‌హెచ్‌బీ బోగీలు షాక్‌ను అబ్జార్బ్ చేసుకుని బోగీలు ఒకదానికొకటి ఢీ కొనకుండా చేస్తుంది. దీంతో బోగీలు పట్టాలు తప్పి నా.. ప్రమాద తీవ్రత, ప్రాణనష్టం తక్కువుంటుంది. ఎస్2 బోగీ చక్రంలో లోపమే ప్రమాదానికి కారణం కావొచ్చని ప్రకాశ్ శర్మ అనే ప్రయాణికుడు తెలిపాడు. తను ఇండోర్‌లో ఎక్కి ఉజ్జరుునిలో దిగేంతవరకు బోగీ చక్రం నుంచి శబ్దం వచ్చిందని దీనిపై అధికారులకు సమాచారమిచ్చినా పట్టించుకోలేదన్నారు. కుటుంబంతో పెళ్లికి వెళ్తూ కాన్పూర్ రైలు ఘటనలో నుజ్జునుజ్జరుున ఎస్1 బోగీలో భోపాల్‌కు చెందిన అరుణ్ శర్మ కుటుంబం (భార్య, ఇద్దరు పిల్లలు) ప్రయాణిస్తోంది. వీరు పట్నాలో జరిగే బంధువుల పెళ్లికి బయలుదేరారు. గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు జరిగిన ఈ ప్రమాదంలో శర్మ కుటుంబం కూడా తీవ్రంగా గాయపడింది. ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆర్మీ బలగాలు వీరిని రక్షించి ఆసుపత్రికి తరలించారుు. అరుుతే.. భార్య, పెద్ద కుమారుడు గాయాలతో ఆసుపత్రిలో చేరినా.. చిన్న కుమారుడి జాడ మాత్రం ఇంకా దొరకలేదని అరుణ్ ఆవేదనగా తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకోసం.. పిల్లలు తమ పెద్దవారి కోసం ఆసుపత్రి వద్ద గాయాలతోనే వెతకటం కలచివేస్తోంది. అమ్మ, తమ్ముడు ఎక్కడ? పట్నాకు చెందిన ఓ 17 ఏళ్ల బాలిక తమ్ముడితో కలిసి ఇండోర్‌లో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొంది. తల్లి కూడా వీరికి తోడుగా వెళ్లింది. పోటీలు ముగించుకుని తిరుగు ప్రయాణమైన వీరి కుటుంబాన్ని రైలు ప్రయాణం ఓ కుదుపు కుదిపింది. తమ్ముడు, తల్లి ఆచూకీ దొరక్కపోవటంతో ఆ బాలిక తమవారికోసం వెతకటం కంటతడి పెట్టించింది. ప్రముఖుల దిగ్భ్రాంతి ‘ప్రమాదం విషయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ అని రాష్ట్రపతి ప్రణబ్ అన్నారు. ‘దుర్ఘటన చాలా బాధాకరం. బాధిత కుటుంబాలకు నా సానుభూతి తెలుపుతున్నాను’అని ప్రధాని ట్విటర్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా రైలు ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఘటన చాలా బాధాకరం’అన్నారు. యూపీ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయకచర్యల్లో చురుగ్గా పాలు పంచుకోవాలని ఆదేశించారు. పుఖ్రయా వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడిన వారికి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎలా జరిగింది? ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ఇండోర్ నుంచి బయలు దేరింది. రాత్రి 12.45 గంటల ప్రాంతంలో యూపీలోని ఒరాయ్ స్టేషన్లో రెండు నిమిషాలు హాల్ట్ తర్వాత కాన్పూర్‌కు బయలుదేరింది. తెల్లవారుజామున 4 గంటలకు కాన్పూర్ చేరుకోవాలి. కానీ అంతకుముందే 3.10 గంటల ప్రాంతంలో పుఖ్రయా-మలాసా స్టేషన్ల మధ్య పట్టాలు తప్పింది. ఈ స్టేషన్ల మధ్యలో ఒకచోట పట్టా విరిగి పోవటంతో (ఇదే కారణమని ప్రాథమిక అంచనా) వేగంగా ఉన్న రైలు పట్టాలు తప్పటం, ఎస్ 1, ఎస్2 బోగీలు ఒకదాంట్లోకి మరొకటి చొచ్చుకుపోవటం క్షణాల్లో జరిగిపోయారుు. ఎస్3, ఎస్4 బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నారుు. దీంతో ఈ నాలుగు బోగీల్లోనే మృతులు, క్షతగాత్రులు ఎక్కువగా ఉన్నారు. అప్పటికే విరిగిన పట్టాను దాటిన జనరల్, ఎస్ 12 నుంచి ఎస్ 5 వరకు బోగీలు, వెనకున్న ఏసీ బోగీ కుదుపులకు గురయ్యారుు. వీటిలో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయని ఉత్తర మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ సక్సేనా వెల్లడించారు. రైలు పట్టా విరగటమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్థారణకు వచ్చినా.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అరుుతే ఘటనకు తొమ్మిది నిమిషాల ముందే అదే ట్రాక్‌పై సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్రయాణించింది. తండ్రి కోసం.. డిసెంబర్ 1న తన కూతురు రూబీ పెళ్లిని ఘనంగా చేయాలన్న కోటి ఆశలతో రాంప్రసాద్ గుప్త కుటుంబం ఇండోర్ నుంచి సొంత గ్రామం మౌకు ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్‌లో బయలు దేరింది. రూబీతోపాటు ఆమె చెల్లెళ్లు, తమ్ముళ్లూ ఉన్నారు. ఇంతలోనే అనుకోని ప్రమాదం ఈ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ప్రమాదం నుంచి అందరూ గాయాలతో బయటపడినా గుప్త ఆచూకీ మాత్రం ఆదివారం రాత్రి వరకు దొరకలేదు. విరిగిన చేతికి కట్టుకట్టుకుని రూబీ.. తండ్రి కోసం ఏడుస్తూ వెతకటం కలచివేసింది. దేశంలో 1988 నుంచి అతి పెద్ద రైలు ప్రమాదాలు 1988 ఏప్రిల్ 18: ఉత్తరప్రదేశ్‌లోని లలిత్పూర్ వద్ద పట్టాలు తప్పిన కర్ణాటక ఎక్స్‌ప్రెస్. 75 మంది మృతి. 1988 జూలై 8: కేరళలోని అష్టముడి సరస్సులోకి పడిన ఐలాండ్ ఎక్స్‌ప్రెస్. 107 మంది మృతి. 1995 ఆగస్టు 20: ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్లో కలిండి ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న పురుషోత్తం ఎక్స్‌ప్రెస్. 400 మంది దుర్మరణం. 1997 సెప్టెంబర్ 14: మధ్యప్రదేశ్ బిలాస్పూర్ జిల్లాలో నదిలోకి పడ్డ అహ్మదాబాద్-హౌరా ఎక్స్‌ప్రెస్‌లోని ఐదు బోగీలు. 81 మంది మృతి 1998 నవంబర్ 26: పంజాబ్‌లోని ఖన్నా వద్ద పట్టాలు తప్పిన ఫ్రంటియర్ మెరుుల్ రైలు బోగీలను ఢీకొన్న జమ్మూ తావి-సియాల్దా ఎక్స్‌ప్రెస్. 212 మంది మృతి. 1999 ఆగస్టు 2: అస్సాంలోని గైసల్ వద్ద రెండు ప్రయాణికుల రైళ్లు ఢీ. 290 మంది మృతి. 2002 సెప్టెంబర్ 9: బిహార్‌లోని ఔరంగాబాద్‌లో ధావే నదిలోకి పడ్డ హౌరా-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్. 100 మంది మృతి. 150 మందికి గాయాలు. 2010 మే 28: పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో జ్ఞానేశ్వరీ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలు తప్పించిన నక్సల్స్. 148 మంది మృతి. 2014 మే 4: మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ వద్ద పట్టాలు తప్పిన సవంత్వాడీ ప్యాసింజర్. 20 మంది దుర్మరణం. 100 మందికి గాయాలు. 2014 మే 26: ఉత్తరప్రదేశ్‌లోని కబీర్‌నగర్ జిల్లాలో సరకు రవాణా రైలును ఢీకొన్న గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్. 25 మంది మృతి. క్షతగాత్రులైన 50 మంది. 2015 మార్చి 20: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ వద్ద పట్టాలు తప్పిన డెహ్రాడూన్-వారణాసి జనతా ఎక్స్‌ప్రెస్. 39 మంది మృతి. 150 మందికి గాయాలు. 2015 ఆగస్టు 4: మధ్యప్రదేశ్‌లోని హార్ధా జిల్లాలో పట్టాలు తప్పిన కామాయణి ఎక్స్‌ప్రెస్. 25 మంది మృతి. 25 మందికి గాయాలు. ఇది జరిగిన సరిగ్గా నిమిషం తర్వాత ఇదే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న జనతా ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పింది. -
యూపీలో ఘోర రైలు ప్రమాదం
-
ఘోర రైలు ప్రమాదం: 30 మంది మృతి
-
ఘోర రైలు ప్రమాదం: 95 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం వేకువజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 95 మందికి పైగా మృతిచెందినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. అధికారుల కథనం ప్రకారం.. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 95మంది మృతిచెందగా, 100కు పైగా ప్రయాణికులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రమాద ఘటనపై సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులను వివరాలు ఆరా తీస్తున్నారు. సహాయకచర్యలు వేగమంతం చేయాలని ఆదేశించారు. పక్కకు ఒరిగిన బోగీలు ఇవే: GS, A1, B1, B2, B3, BE, S1, S2, S3, S4, S5, S6, లగేజ్ ర్యాక్ హెల్ప్ లైన్ నంబర్లు: 05101072, 051621072, 05121072. సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి క్షతగాత్రులకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు రైల్వే అధికారి అనిల్ సక్సేనా చెప్పారు. రైలు ప్రమాదం ఘటన కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. Please note helpline nos All calls are attended to help anyone needing assistance pic.twitter.com/9aEsXalwR0 — Suresh Prabhu (@sureshpprabhu) 20 November 2016