ఘోర రైలు ప్రమాదం: 95 మంది మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లో ఆదివారం వేకువజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 95 మందికి పైగా మృతిచెందినట్లు రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. అధికారుల కథనం ప్రకారం.. యూపీలోని దేహత్ జిల్లా కాన్పుర్ సమీపంలోని పక్హరయన్ వద్ద పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ రైలు 14 బోగీలు పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 95మంది మృతిచెందగా, 100కు పైగా ప్రయాణికులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రమాద ఘటనపై సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులను వివరాలు ఆరా తీస్తున్నారు. సహాయకచర్యలు వేగమంతం చేయాలని ఆదేశించారు.
పక్కకు ఒరిగిన బోగీలు ఇవే: GS, A1, B1, B2, B3, BE, S1, S2, S3, S4, S5, S6, లగేజ్ ర్యాక్
హెల్ప్ లైన్ నంబర్లు: 05101072, 051621072, 05121072.
సమాచారం అందుకున్న వెంటనే మెడికల్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించి క్షతగాత్రులకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు రైల్వే అధికారి అనిల్ సక్సేనా చెప్పారు. రైలు ప్రమాదం ఘటన కారణంగా ఈ మార్గంలో వెళ్లే పలు రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Please note helpline nos All calls are attended to help anyone needing assistance pic.twitter.com/9aEsXalwR0
— Suresh Prabhu (@sureshpprabhu) 20 November 2016