
శ్రీనగర్ : ప్రాణాంతక కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ మరణాల సంఖ్య, పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతోంది. తాజా జమ్ముకశ్మీర్ లో తొలి మరణం సంభవించింది. సోపోరేవ్‌కు చెందిన వ్యక్తి (65) కోవిడ్ -19 పాజిటివ్ రావడంతో శ్రీనగర్‌లోని చెస్ట్ డిసీజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. దీంతో కశ్మీర్ తొలి మరణాన్ని నమోదైంది. అంతేకాదు ఇతనితో సన్నిహితంగా మెలిగిన మరో నలుగురు వ్యక్తులు కూడా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక రిపోర్టుల ప్రకారం మలేషియా, ఇండోనేషియా ప్రజలు హాజరైన తబ్లిఘి జమాత్ కార్యక్రమంలోఈయన పాల్గొన్నారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ లో కూడా ఈయన ప్రయాణం చేశారు.