ఇది బీజేపీ విజయం కాదు: ఖుష్బూ | Khushbhu Sundar Slams BJP on owning Triple Talaq Victory | Sakshi
Sakshi News home page

ఇది బీజేపీ విజయం కాదు: ఖుష్బూ

Published Wed, Aug 23 2017 10:35 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

ఇది బీజేపీ విజయం కాదు: ఖుష్బూ - Sakshi

ఇది బీజేపీ విజయం కాదు: ఖుష్బూ

ట్రిపుల్‌ తలాక్‌ విజయాన్ని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని నటి, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఖుష్బూ సుందర్‌ అన్నారు. విజయం ఏదైనా దాని క్రెడిట్‌ తమకే దక్కాలని  బీజేపీ భావిస్తోందని చెప్పారు. ట్రిపుల్‌ తలాక్‌ విజయం బీజేపీ క్రెడిట్‌ కాదని అన్నారు.

ఇది భారతీయ మహిళల విజయమని ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. 'సుప్రీంకోర్టు విడాకులపై నిషేధం విధించలేదు. కానీ, అప్పటికప్పుడు తలాక్‌ చెప్పే పద్దతిపై నిషేధం విధించింది. 'పర్సనల్‌ లా'లు ఆర్టికల్‌ 25 కింద ఇంకా అమల్లోనే ఉంటాయి.' అని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సభ్యడు కమల్‌ ఫారుఖీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement