అప్పుడు మేం తేలేదన్నారు.. మరి ఇప్పుడో..!
గుణ(మధ్యప్రదేశ్): కోహినూర్ వజ్రాన్ని భారత్లకు తిరిగి రప్పించలేమన్న కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావడం లేదని బీజేపీ తరుచుగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందని, అలాంటిది.. అప్పటి రాజు ఈస్ట్ ఇండియా కంపెనీకి బహుమతిగా ఇచ్చేశారని ఎలా నివేదిక సమర్పిస్తారని ప్రశ్నించారు.
కోహినూర్ వజ్రాన్ని తిరిగి రప్పించే విషయంపై వేసిన ప్రజాప్రయోజన వాజ్యాన్ని విచారించిన సుప్రీంకోర్టు ఈ అంశం స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశంలో నివేదిక ఇచ్చిన కేంద్ర సాంస్కృతికశాఖ కోర్టుకు.. కోహినూర్ను ఎవరూ బలవంతంగా గానీ, దొంగతనంగా గానీ దేశం నుంచి తీసుకుపోలేదని సిక్కులతో యుద్ధంలో సహాయం చేసినందుకుగాను మహారాజా రంజిత్ సింగ్ 1849లో కోహినూర్ను బహుమతిగా ఇచ్చారని వివరించింది.