
ఢిల్లీ సీఎంగా కుమార్ విశ్వాస్!
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్‌ను గద్దె దించుతారంటూ జోరుగా సాగుతున్న ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా బీజీపీ కీలక నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార ఆప్‌కు చెందిన 34 మంది ఎమ్మెల్యేలు సీఎం కేజ్రీవాల్ పట్ల అసంతృప్తిగా ఉన్నారని, వారంతా వేరుకుంపటి పెట్టి ఆప్ కీలక నేత కుమార్‌విశ్వాస్ ను ముఖ్యమంత్రిగా ఎన్నుబోతున్నారంటూ ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి పాల్ ఎస్ బగ్గా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం 34 ఆప్ ఎమ్మెల్యేలు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాకు పట్టుపట్టినట్లు బగ్గా తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఖండిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే పార్టీకి ఓట్లు దక్కలేదని, అయితే ఆత్మ పరిశీలన చేసుకొని తిరగి పుంజుకుంటామని కుమార్‌విశ్వాస్ తెలిపారు.కాగా సీఎం కేజ్రీవాల్ వాదనకు విరుద్ధంగా.."ఓటర్లు ఓట్లువేయనప్పుడు ఈవీఎం లను విమర్శించడం తగదు" అని ఆయన అన్నారు.