ముదురుతున్న ‘న్యాయ’ వివాదం | 'legal' dispute was raising | Sakshi
Sakshi News home page

ముదురుతున్న ‘న్యాయ’ వివాదం

Published Sun, Nov 27 2016 12:51 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

ముదురుతున్న ‘న్యాయ’ వివాదం - Sakshi

ముదురుతున్న ‘న్యాయ’ వివాదం

హైకోర్టు జడ్జీల నియామక జాప్యంపై సుప్రీం చీఫ్ జస్టిస్ అసంతృప్తి
- ట్రిబ్యునళ్లలో సిబ్బంది, మౌలిక వసతుల లేమి వేధిస్తోందని ఆవేదన
- సీజేఐ అభిప్రాయంతో విభేదించిన కేంద్ర మంత్రి రవిశంకర్
- ఈ ఏడాది పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ చేసినట్లు వెల్లడి
 
 న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక అంశంపై న్యాయవ్యవస్థ, కేంద్రప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. జడ్జీల నియామకంలో జరుగుతున్న జాప్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీఐజే) జస్టిస్ టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారమిక్కడ జరిగిన జాతీయ రాజ్యాంగ దినోత్సవ’ సదస్సులో జస్టిస్ ఠాకూర్ మాట్లాడారు. ‘ప్రస్తుతం హైకోర్టుల్లో 500 జడ్జీల పోస్టులు ఖాళీగా ఉన్నారుు. ఇప్పటికే ఆ నియామకాలు పూర్తి కావాల్సి ఉంది. కానీ వాటిపై ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. దేశంలో న్యాయమూర్తులు లేని కోర్టులు అనేకం ఉన్నారుు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నారుు. ఈ సంక్షోభాన్ని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు.

కాగా, సీఐజే అభిప్రాయంతో కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ విభేదించారు. హైకోర్టుల్లో నియామకాల భర్తీకి కేంద్రం కృషి చేస్తోందని చెప్పారు. ఈ ఏడాది 120 ఖాళీలను భర్తీ చేసినట్లు తెలిపారు. 1990 తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో నియామకాలు జరపడం ఇది రెండోసారి అని చెప్పారు. మౌలిక సౌకర్యాల కల్పన అనేది నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నా రు. నియామకాలను పారదర్శకంగా జరి పేందుకు సంబంధించిన మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్(ఎంవోపీ)పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడాల్సి ఉందని, దీని కోసం మూడు నెలలకు పైగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కింది స్థారుు కోర్టుల్లో 5 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని భర్తీ చేసే బాధ్యత కేంద్రం చేతుల్లో లేదన్నారు.

 న్యాయమూర్తులు ముందుకు రావడం లేదు..
 సదస్సులో సీజేఐ జస్టిస్ ఠాకూర్ మాట్లాడుతూ.. ట్రిబ్యునళ్లలో సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాల లేమి వల్ల కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిబ్యునళ్లలో ఎటువంటి వసతులు లేకపోవడంతో వీటికి నేతృత్వం వహించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తులు ముందుకు రావడం లేదన్నారు. కనీస వసతులు లేని చోటకు పంపడం ద్వారా వారిని ఇబ్బంది పెట్టడం తనకు బాధ కలిగించే అంశమని పేర్కొన్నారు. తగిన సంఖ్యలో న్యాయమూర్తులు లేకుండా ట్రిబ్యునళ్లు గానీ, బెంచ్‌లు గానీ ఎలా ఏర్పాటు చేయగలమని ప్రశ్నించారు. ప్రభుత్వం కనీసం ఈ ట్రిబ్యునళ్లనైనా పూర్తి స్థారుులో బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. వివిధ ట్రిబ్యునళ్లలో చైర్‌పర్సన్లు, సభ్యుల నియామకాలకు సంబంధించి నిబంధనల్లో పలు సవరణలు చేయాల్సిన అవసరముందన్నారు. తద్వారా ఆయా పోస్టులకు హైకోర్టు జడ్జీలు కూడా అర్హులవుతారని పేర్కొన్నారు. సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
 
 లక్ష్మణ రేఖను దాటొద్దు: సీజేఐ
 ప్రభుత్వ విభాగాలు తమ పరిధి దాటి ప్రవర్తించవద్దని.. ‘లక్ష్మణరేఖ’ను దాటవద్దని సీజేఐ జస్టిస్ టీఎస్ ఠాకూర్ పేర్కొన్నారు. శనివారం ఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ... పార్లమెంట్ తీసుకున్న ఏ నిర్ణయమైనా అసంబద్ధంగా ఉందనిపిస్తే దాన్ని పక్కన పెట్టే అధికారం న్యాయవ్యవస్థకు ఉందన్నారు. చట్ట, రాజ్యాంగ బద్ధంగా లేకపోతే చట్టసభలు తీసుకున్న నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్నారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల విధులు, బాధ్యతలను రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. పార్లమెంట్‌కు చట్టాలు చేసే హక్కు ఉన్నా... అది రాజ్యాంగానికి లోబడే ఉండాలని సూచించారు. ఏదైనా నిర్ణయంతో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని భావిస్తే... తప్పు అని ప్రభుత్వానికి చెప్పే హక్కు న్యాయవ్యవస్థకు ఉందన్నారు. నవంబర్ 26ను న్యాయ దినోత్సవంగా కంటే రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవడం మంచి పరిణామమని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement