
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని లేహ్‌లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. లఢక్‌లోని లేహ్‌లో గురువారం రాత్రి అత్యల్పంగా మైనస్ 11.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతకుముందు రాత్రి మైనస్ 7.1 డిగ్రీలుగా నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కార్గిల్‌లో మైనస్ 9.2 డిగ్రీలు, శ్రీనగర్‌లో మైనస్ 2.8 డిగ్రీలు, దక్షిణ కశ్మీర్‌లోని ఖాజీగంఢ్‌లో మైనస్ 2.4 డిగ్రీలు, గుల్‌మార్గ్‌లోని స్కీ రిసార్ట్‌లో మైనస్ 5.4 డిగ్రీలు, పహల్గామ్ వద్ద మైనస్ 2.4 డిగ్రీలు నమోదయ్యాయి.