
'భారత రవాణా మంత్రి కావాలని ఉంది'
కోల్ కతా:భారత రవాణా మంత్రిత్వ శాఖపై బ్రిటీష్ రచయిత జెఫ్రీ ఆర్చర్ మనసుపడ్డాడు. తనకు మళ్లీ జన్మ అంటూ ఉంటే భారత్ లో రవాణా మంత్రిగా చేయాలని ఉందని మనుసులోని కోరికను స్పష్టం చేశాడు ఆర్చర్. ఈ భూమి మీద అత్యంత కఠినమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే అది భారత్ లోని రవాణా మంత్రిత్వ శాఖేనని అభిప్రాయపడ్డాడు.
'ప్రస్తుతానికి నాకు ఆ అవకాశం లేదు. మళ్లీ జన్మ ఉంటే భారత్ లోని ఆ శాఖకు మంత్రిగా పని చేస్తా'అని అన్నాడు.ఒక వేళ అది సాధ్యం కాకపోతే ఇంగ్లండ్ క్రికెట్ కు కెప్టెన్ గా చేయాలని ఉందని తెలిపాడు. తను రాసిన 'మైటియర్ ధేన్ ది స్వార్డ్' పుస్తక ఆవిష్కరణలో భాగంగా ఇక్కడకు హాజరైన ఆర్చర్ పై విధంగా స్పందించాడు.