ముఖ్యమంత్రి పదవిలో మృతి చెందిన నేతలు | list of chief ministers who died in office | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి పదవిలో మృతి చెందిన నేతలు

Published Tue, Dec 6 2016 12:47 PM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

ముఖ్యమంత్రి పదవిలో మృతి చెందిన నేతలు - Sakshi

ముఖ్యమంత్రి పదవిలో మృతి చెందిన నేతలు

హైదరాబాద్ : సాధారణ కుటుంబం నుంచి వచ్చిన జయలలిత తమిళ రాజకీయాల్లో ఓ మహాశిఖరం. జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసి అత్యున్నత స్థానానికి చేరారు. ఆస్పత్రిలో 74 రోజుల పాటు మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచారు.
 
మన దేశ రాజకీయాల్లో సీఎం పదవిలో ఉంటూ పలువురు మృతిచెందారు. అనారోగ్య సమస్యలతో మృతి చెందిన వారు కొందరైతే... వివిధ ప్రమాదాల్లో మరణించిన వారు మరికొందరు ఉన్నారు. తమిళనాడులో ముఖ్యమంత‍్రి పదవిలో ఉండగా ముగ్గురు మృతి చెందారు. తమిళనాడులో సీఎన్ అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, తాజాగా జయలలిత ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ మరణించారు. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక మన పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో మెరత్ వార్ కన్నంవార్ సీఎం పదవిలో ఉంటూ మరణించారు.

రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రి పదవిలో మరణించిన నేతలు

ముఖ్యమంత్రి                               రాష్ట్రం పేరు   
    
             
గోపినాథ్ బోర్దొలాయ్                       అసోం                          
రవిశంకర్ శుక్లా                               మధ్యప్రదేశ్
కృష్ణ సింగ్                                    బిహార్
బిధాన్ చంద్ర రాయ్                        పశ్చిమ బెంగాల్
మెరత్ వార్ కన్నంవార్                    మహారాష్ట్ర
సీఎన్ అన్నాదురై                           తమిళనాడు
గులాం మహమ్మద్ సాదిక్                జమ్ము కాశ్మీర్
దయనంద్ బందోద్కర్                      గోవా
బర్కతుల్లా ఖాన్                            రాజస్థాన్
షేక్ అబ్దుల్లా                                  జమ్ము కాశ్మీర్
ఎంజీ రామచంద్రన్                          తమిళనాడు
చిమన్ భాయ్ పటేల్                       గుజరాత్
బియంత్ సింగ్                               పంజాబ్
వైఎస్ రాజశేఖర్ రెడ్డి                       ఆంధ్రప్రదేశ్
డోర్జీ ఖండు                                   అరుణాచలప్రదేశ్‌
ముఫ్తీ మహమ్మద్ సయ్యద్             జమ్ముకాశ్మీర్
జయలలిత                                  తమిళనాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement