ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ బిల్లు | lk advani comments | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి మొదటి వారంలో తెలంగాణ బిల్లు

Published Fri, Jan 3 2014 1:07 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

lk advani comments

బిల్లు కోసమే ప్రోరోగ్ చేయలేదు: అద్వానీ


 సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ బిల్లు పార్లమెంటుకు వస్తుందని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ చెప్పారు. తెలంగాణ బిల్లు కోసమే ప్రోరోగ్ చేయలేదన్నారు. గురువారం రాజ్యసభ విపక్ష నేత అరుణ్ జైట్లీ ఇచ్చిన విందులో పాల్గొన్న అద్వానీ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు ఎప్పుడు వస్తుందని అడిగిన ప్రశ్నించగా.. ఫిబ్రవరి మొదటి వారంలో బిల్లు వస్తుందని, అందుకోసమే తాము ప్రోరోగ్ చేయలేదని బదులిచ్చారు. టీడీపీతో పొత్తు విషయమై అరుణ్ జైట్లీని అడగ్గా.. ‘‘ పొత్తు ఏమైనా ఉంటే మీతో చెబుతాం’’ అని బదులిచ్చారు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement