
ఢిల్లీ: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఫడణవీస్ తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడించలేదంటూ సతీశ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపి ఫడణవీస్‌కు నోటీసులు ఇచ్చింది.
ఫడణవీస్ ఎన్నికను రద్దు చేయాలంటూ తొలుత హైకోర్టులో సతీశ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ çసుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఫడణవీస్‌పై 1996, 1998లో చీటింగ్, ఫోర్జరీకి సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment