సాక్షి, చెన్నై : షార్జా నుంచి కోయంబత్తూరుకు వచ్చిన ఎయిర్ అరేబియా విమానానికి ల్యాండింగ్ సమయంలో నెమళ్ల గుంపు అడ్డుగా వచ్చింది. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానానికి, నెమళ్లకూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆదివారం తెల్లవారుజామున 3.40 గంటలకు 107 మంది ప్రయాణికులతో వచ్చిన విమానం కోయంబత్తూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కు సిద్ధం అయింది.
రన్ వే మీదుగా హఠాత్తుగా నెమళ్ల గుంపు రావడంతో పైలట్ వెంటనే ప్రయాణికుల్ని అప్రమత్తం చేశారు. చాకచక్యంగా వ్యవహరించి విమాన వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ నెమళ్లను ఢీ కొనకుండా విమానాన్ని జాగ్రత్తగా ల్యాండింగ్ చేశారు. దీంతో విమానానికి ప్రమాదం తప్పినట్టు అయింది. ఓ నెమలి ఈక మాత్రం విమానం రెక్కలో ఇరుక్కుని ఉండటాన్ని ఇంజనీర్లు గుర్తించారు. ఈ విమానం రన్ వే మీదే ఎక్కువ సమయం ఉండాల్సి వచ్చింది. దీంతో ఉదయం 4.30 గంటలకు షార్జా బయలుదేరాల్సిన మరో విమానం ఆలస్యంగా టేకాఫ్ తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment