
♦ నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం
♦ ప్రపంచ వ్యాప్తంగా 78.54 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు
►ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 4.31 లక్షల మంది మృతి
►ప్రపంచ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 40.17 లక్షల మంది
ఢిల్లీ: నేడు కేంద్రహోం మంత్రి అమిత్ షాతో సీఎం కేజ్రీవాల్ భేటీ
♦ నేడు తెరచుకోనున్న శబరి ఆలయం
►నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరవనున్న అధికారులు
►భక్తులకు అనుమతి లేదంటూ ఉత్తర్వులు జారీ చేసిన కేరళ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్:
అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్ రెడ్డిలను జడ్జి ముందు హాజరుపర్చిన పోలీసులు
►14రోజుల రిమాండ్ విధింపు, కడప సెంట్రల్ జైలుకు తరలింపు
విశాఖపట్నం: నైరుతి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం
♦ నేడు తిరుమలలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం
తెలంగాణ:
♦ ఈ నెల 16న కలెక్టర్లతో కేసీఆర్ భేటీ
►వానాకాలం సాగు ఏర్పాట్లతో పాటు గ్రామీణ ఉపాధి హామి పథకం, హరితహారం అమలుపై సమీక్షించేందుకు సీఎం కేసీఆర్ ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment