కేంద్ర మాజీ మంత్రి కారు ఢీ.. వ్యక్తి మృతి | Man hit by Jyotiraditya's car dies | Sakshi
Sakshi News home page

కేంద్ర మాజీ మంత్రి కారు ఢీ.. వ్యక్తి మృతి

Published Wed, Aug 10 2016 6:44 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM

కేంద్ర మాజీ మంత్రి కారు ఢీ.. వ్యక్తి మృతి - Sakshi

కేంద్ర మాజీ మంత్రి కారు ఢీ.. వ్యక్తి మృతి

అలపూజ: మాజీ ఎంపీ, కేంద్రమంత్రి కారు ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలుకోల్పోయాడు. కేరళలోని అలపూజలో గల థంకీ చౌరస్తాలోని బిషప్ మోర్ స్కూల్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అలపూజలో ఎంపీ కేసీ వేణుగోపాల్ నిర్వహించే ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతున్న మాజీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా ప్రయాణిస్తున్న కారు శశి(70) అనే వ్యక్తిని ఢీకొట్టింది.

అతడిని వెంటనే చెర్తాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా అప్పటికే ప్రాణాలుకోల్పోయాడు. శశి చెర్తాలలోని ఉన్నికాందాతిల్ నివాసానికి చెందినవాడు. మృతుడి ఇంటికి వెళ్లి మాజీ ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దురదృష్టవశాత్తు అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయని, అందుకు తీవ్ర విచారంగా ఉందని, తీవ్ర దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని కలిసేందుకు వెళుతున్నానంటూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement