రిజిస్టర్ పోస్ట్లో లంచం.. ఆఫీసులో కలకలం! | Man sends Rs 500 bribe through registered post to Bihar official | Sakshi
Sakshi News home page

రిజిస్టర్ పోస్ట్లో లంచం.. ఆఫీసులో కలకలం!

Published Sat, Jul 9 2016 8:38 PM | Last Updated on Thu, Jul 18 2019 2:02 PM

రిజిస్టర్ పోస్ట్లో లంచం.. ఆఫీసులో కలకలం! - Sakshi

రిజిస్టర్ పోస్ట్లో లంచం.. ఆఫీసులో కలకలం!

పాట్నా: తనకు కావలసిన సమాచారం అందించాలని కోరుతూ ఓ వ్యక్తి బిహార్ అధికారికి పోస్ట్ ద్వారా లంచాన్ని పంపించాడు. ఆ పోస్ట్ బిహార్ సమాచార కమిషన్ ఆఫీసులో కలకలం రేపింది. ఖగారియా జిల్లాకు చెందిన సనోజ్ మిశ్రా ఇటీవల ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఓ పిటీషన్ దాఖలుచేశాడు. అయితే ఈ పిటీషన్ వివరాలు తనకు త్వరగా తెలియజేయాలని కోరుతూ ఇన్ఫర్మేషన్ లో పనిచేసే ఓ ఉద్యోగికి రిజిస్ట్రర్ పోస్ట్ లో రూ.500 పంపించాడు.

అందులో అతను సొంతంగా రాసిన ఓ లేఖ.. తాను పంపిన డబ్బులను ఉద్యోగి పిల్లలకు స్వీట్లు కొనిపించాలని కోరాడు. ఆఫీస్ అడ్రస్ రాసి రిజిస్టర్ పోస్ట్ పై బడా-బాబు అని రాశాడని ఓ అధికారి వెల్లడించారు. పాట్నాలోని సచివాలయ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారులను ఈ విషయంపై ప్రశ్నిస్తే ఎవ్వరూ నోరువిప్పేందుకు సముఖత చూపలేదని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement