
మిశ్రాను కొట్టిన యువకుడు జాబ్ వదిలేశాడు
న్యూఢిల్లీ: కపిల్ మిశ్రాపై దాడికి ప్రయత్నించిన యువకుడు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ జెండా పట్టుకోబోతున్నాడు. అతడు తాను చేస్తున్న సీఏ ఉద్యోగాన్ని వదిలేసి ఇక ఆప్‌కు సేవలు అందించాలని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఆమ్ ఆద్మీపార్టీ నుంచి బహిష్కరణకు గురైన కపిల్ మిశ్రాపై అంకిత్ భరద్వాజ్ దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.
అరవింద్ కేజ్రీవాల్‌పై అవినీతి ఆరోపణలు చేసిన కపిల్ మిశ్రా అనంతరం పార్టీ నుంచి బహిష్కరణ వేటుకు గురై నిరాహార దీక్షకు దిగిన సమయంలో అంకిత్ దాడి చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం అతడు తన ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశాడు. ఈ విషయాన్ని పోలీసుల విచారణలో బయటపెట్టినట్లు తెలిపారు. మోతీ బాగ్ ప్రాంతానికి చెందిన అంకిత్ మిశ్రా మెడపట్టుకొని చంపేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.