చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో బుధవారం మావోయిస్టులు జరిపిన కాల్పులలో ఒక వ్యాపారి మృతి చెందాడు. జిల్లాలోని మర్దాపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల మట్‌వాల్ గ్రామంలో వారాంతపు సంత జరుగుతుండగా గ్రామీణుల వేషధారణలో వచ్చిన మావోయిస్టులు అన్నదమ్ములైన వ్యాపారులు రూపేంద్ర కాశ్యప్, కేదార్‌నాధ్ కాశ్యప్ అనే వ్యాపారులపై కాల్పులు జరిపారు.
కాల్పుల్లో రూపేంద్ర కాశ్యప్ అక్కడికక్కడే మతిచెందగా, కేదార్‌నాధ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా వుండడంతో కొండగావ్ ఆసుపత్రికి తరలించారు.