సాక్షి, న్యూఢిల్లీ : మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) లేదా రాష్ట్ర మెడికల్ కౌన్సిల్(ఎస్‌ఎమ్‌సీ) ఆమోదం పొందని వ్యక్తి జారీ చేసే మెడికల్ లేదా ఫిట్‌నెస్ సర్టిఫికెట్స్ చెల్లుబాటు కావని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విన్ కుమార్ చౌబే వెల్లడించారు. మంగళవారం రాజ్యసభలో ఈ మేరకు రాత పూర్వక సమాధానం ఇచ్చారాయన. పాథలాజీలో పీజీ చేసిన డాక్టర్ మాత్రమే ఫిట్‌నెస్ లేదా మెడికల్ సర్టిఫికెట్స్‌ను జారీ చేయగలరని చెప్పారు. ఇందుకు గతేడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు.
ఉత్తర గుజరాత్‌లో పాథాలజిస్టుల అసోసియేషన్లు వేసిన పిటిషన్‌ను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం పాథాలజీలో పీజీ కలిగిన రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ మాత్రమే మెడికల్ లేదా ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు జారీ చేయగలరని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment