
స్కూల్లో విద్యార్థినిపై దారుణం
శ్రీనగర్: జమ‍్ము కశ్మీర్లో రాంబన్ జిల్లాలోని చంబల్బస్ గ్రామం పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థినిపై టీచర్ లైంగికదాడి చేశాడు. తరగతులు ముగిసిన తర్వాత నిందితుడు స్కూలు ఆఫీస్ రూమ్లోకి విద్యార్థిని తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డాడు.
బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు హయత్ ఖాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్యపరీక్షలకు పంపారు.