17 లక్షల వాచీ కొట్టేసి.. రూ. 100కు అమ్మేశారు!! | Minor thieves steal Rs 17 lakh watch, sell it for Rs 100! | Sakshi
Sakshi News home page

17 లక్షల వాచీ కొట్టేసి.. రూ. 100కు అమ్మేశారు!!

Published Sat, Jun 7 2014 9:57 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

17 లక్షల వాచీ కొట్టేసి.. రూ. 100కు అమ్మేశారు!!

17 లక్షల వాచీ కొట్టేసి.. రూ. 100కు అమ్మేశారు!!

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో పిల్లదొంగలు బయల్దేరారు. వాళ్లు అలాంటి, ఇలాంటి దొంగతనాలు చేయట్లేదు. 17 లక్షల విలువ చేసే రోలెక్స్ వాచీ కొట్టేసి, దాన్ని ఓ పాన్వాలాకు కేవలం 100 రూపాయలకు అమ్మేశారు. మరో సంఘటనలో 12 లక్షల రూపాయల విలువ చేసే మరో వాచీని కొట్టేసి, దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తుక్కు వ్యాపారికి అమ్మేశారు. మరో ఇంటి ఏసీ వైరును కట్ చేసి ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్లబోతుండగా విజయ్ సింగ్ అనే కాలనీ వాసి వాళ్లను గమనించి పట్టుకున్నారు. ఈ పిల్లలంతా 12 నుంచి 15 ఏళ్లలోపువారేనని, వీళ్లు బడి జుగాలి ప్రాంతానికి చెందినవాళ్లని, సాధారణంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన పియూష్ మిశ్రా అనే కాంగ్రెస్ మంత్రి నెహ్రూ ఎన్క్లేవ్లో ఉన్న తన ఇంటికి మరీ అంత తరచుగా వెళ్లరు. ఆ ఇల్లు ఖాళీగా ఉంటోందన్న విషయం ఈ పిల్ల దొంగలకు తెలిసింది. దాంతో కిటికీలు పగలగొట్టి, లోపలకు వెళ్లి వాచీలు, కెమెరా, బంగారు గొలసులు, ఉంగరాలు దొంగిలించుకుని వచ్చి, వాటిని చవగ్గా అమ్మేశారు. వాటి విలువ తెలియకపోవడంతోనే వందేసి రూపాయలకు అమ్మేశారు. వాళ్లు చెప్పిన వివరాల ఆధారంగా ఫోన్లు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement