rolex watch stolen
-
పెరూ అధ్యక్షురాలి ఇంట్లో ‘రోలెక్స్’ల కోసం సోదాలు!
లీమా: రోలెక్స్ గేట్ వ్యవహారం పెరూను కుదిపేస్తోంది. అధ్యక్షురాలు డినా బొలార్టీ వద్ద 10కి పైగా అతి ఖరీదైన లెక్స్ గడియారాలున్నాయన్న ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది. వాటికోసం కోర్టు ఆదేశాలతో లిమాలోని ఆమె నివాసంలో పోలీసులు సోదా లు నిర్వహించారు! సోదాలను టీవీ చానల్లో ప్రసారం చేశారు. వాచ్‌లు దొరికాయో లేదో వెల్లడించలేదు. తనవద్ద 18 ఏళ్ల వయసులో సొంత డబ్బులతో కొనుక్కున్న ఒకే రోలెక్స్ ఉందని డినా అంటున్నారు. -
90 వాచీలు.. 9 కోట్లు.. కొట్టేశాడు!
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలనుకున్నాడు. అందుకే.. నేరుగా ఓ వాచీల దుకాణంలోకి దూరాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. 90 వాచీలు కొట్టేశాడు ఆఫ్ట్రాల్ 90 వాచీలతో ఏమైపోతుందని అనుకుంటున్నారా.. వాటి విలువ అక్షరాలా 9 కోట్ల రూపాయలు! అంటే, ఒక్కోటీ సుమారు 10 లక్షలన్న మాట!! వాచీల దుకాణం పక్కనే బంగారం దుకాణం ఉన్నా.. పుత్తడి జోలికి వెళ్లకుండా రోలెక్స్ వాచీల మీదే మనసుపడ్డాడు మన దొంగ గారు! దేశ రాజధాని న్యూఢిల్లీలోని కనాట్ ప్లేస్ ప్రాంతంలో గల కుకీ అండ్ కెల్వీ షోరూంలో ఈ ఘరానా దొంగతనం జరిగింది. ఈ వాచీల గురించి, వాటి ఖరీదు గురించి బాగా తెలిసిన దొంగే ఈ చోరీకి పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. చోరీ స్థలంలో ఓ బాలుడి వేలిముద్రలు కూడా ఉన్నాయని ఫోరెన్సిక్ బృందం గుర్తించింది. అంటే.. సదరు దొంగగారు ఓ చిన్న పిల్లాడిని కూడా వెంటపెట్టుకుని వచ్చి షట్టర్ తెరిచి దొంగతనానికి పాల్పడ్డాడన్న మాట. షోరూంలో ఇంత విలువైన వస్తువులున్నా.. సీసీ కెమెరాలు అమర్చకపోవడం యాజమాన్యం నిర్ల్యక్షమే. దొంగతనం జరిగిన సమయంలో ఆ షోరూం బయట సెక్యూరీటీ గార్డు విధిలో ఉన్నాడు. అప్పటికే తాను నిద్రపోయానని అతగాడు చెప్పడంతో అతడి హస్తం కూడా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అందులో పనిచేస్తున్న సిబ్బంది, మానేసిన సిబ్బందిని కూడా విచారిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
17 లక్షల వాచీ కొట్టేసి.. రూ. 100కు అమ్మేశారు!!
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో పిల్లదొంగలు బయల్దేరారు. వాళ్లు అలాంటి, ఇలాంటి దొంగతనాలు చేయట్లేదు. 17 లక్షల విలువ చేసే రోలెక్స్ వాచీ కొట్టేసి, దాన్ని ఓ పాన్‌వాలాకు కేవలం 100 రూపాయలకు అమ్మేశారు. మరో సంఘటనలో 12 లక్షల రూపాయల విలువ చేసే మరో వాచీని కొట్టేసి, దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తుక్కు వ్యాపారికి అమ్మేశారు. మరో ఇంటి ఏసీ వైరును కట్ చేసి ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్లబోతుండగా విజయ్ సింగ్ అనే కాలనీ వాసి వాళ్లను గమనించి పట్టుకున్నారు. ఈ పిల్లలంతా 12 నుంచి 15 ఏళ్లలోపువారేనని, వీళ్లు బడి జుగాలి ప్రాంతానికి చెందినవాళ్లని, సాధారణంగా తాళాలు వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పియూష్ మిశ్రా అనే కాంగ్రెస్ మంత్రి నెహ్రూ ఎన్‌క్లేవ్‌లో ఉన్న తన ఇంటికి మరీ అంత తరచుగా వెళ్లరు. ఆ ఇల్లు ఖాళీగా ఉంటోందన్న విషయం ఈ పిల్ల దొంగలకు తెలిసింది. దాంతో కిటికీలు పగలగొట్టి, లోపలకు వెళ్లి వాచీలు, కెమెరా, బంగారు గొలసులు, ఉంగరాలు దొంగిలించుకుని వచ్చి, వాటిని చవగ్గా అమ్మేశారు. వాటి విలువ తెలియకపోవడంతోనే వందేసి రూపాయలకు అమ్మేశారు. వాళ్లు చెప్పిన వివరాల ఆధారంగా ఫోన్లు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.