
వానరాలకు ఆహారం పెడుతున్న ఎమ్మెల్యే
భువనేశ్వర్ : కరోనా రక్కసి ప్రభావం కేవలం మనుషులపైనే కాదు.. మూగ జీవాలపై కూడా పడింది. వ్యాధి తీవ్రతను నియంత్రించేందుకు విధించిన లాక్‌డౌన్‌తో తిండి దొరక్క సర్వ ప్రాణులు ఆకలి సంక్షోభంలో అలమటిస్తున్నాయి. రోడ్లపై రాకపోకలు దాదాపుగా నిలిచిపోవటంతో అవిభక్త కొరాపుట్ జిల్లా అటవీ ప్రాంతం గుండా వాహనదారులు వేసే ఆహార పదార్ధాలు తినే వానరాలు కూడా.. ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో నవరంగపూర్ జిల్లా డాబుగాం ఎమ్మెల్యే మరోహర రొంధారి ఆ మూగజీవాల ఆకలి తీర్చడంపై దృష్టి పెట్టారు. తన వాహనంలో అరటిపండ్లు, ఆహార పదార్ధాలను తీసుకెళ్లి, ఘాట్ రోడ్డులోని వానరాలకు పెడుతున్నారు. తన చుట్టూ మూగిన వానరాలకు ప్రేమగా తన చేతులతో ఆహారాన్ని అందిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వీధుల్లో తిరిగే పశువులు, శునకాలకు ఆయన ఆహారం పెడుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఒరిస్సాలో ఇప్పటివరకు 160కేసులు నమోదు కాగా, ఒకరు మృత్యువాత పడ్డారు. ఆదివారం ఒక్కరోజే 6కేసులు నమోదయ్యాయి.
చదవండి : ట్రాక్టర్‌పై పెద్ద పులితో పోరాడి..
Comments
Please login to add a commentAdd a comment