టుటు సాహు, ట్వింకిళ్ల జంట
భువనేశ్వర్ : కరోనా లాక్‌డౌన్ పెళ్లిళ్లకు అడ్డుకావటం లేదు. నిరాడంబరంగానైనా మూడు ముళ్లతో ఒక్కటవుతున్నాయి కొన్ని జంటలు. సోమవారం ఒరిస్సాకు చెందిన ఓ జంట గుడిలో కాకుండా కలెక్టరేట్ వేదికగా పెళ్లిచేసుకుంది. వివరాలు.. మహిపుర్ గ్రామానికి చెందిన టుటు సాహు అనే కంప్యూటర్ టీచర్, నౌసాహి రాయ్‌పాదకు చెందిన ట్వింకిల్‌ల పెళ్లి గత డిసెంబర్‌లోనే జరగాల్సి ఉంది. కానీ, కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల కారణంగా వేడుక ఫిబ్రవరి 28కి వాయిదా పడింది. అప్పడు కూడా పెళ్లి వాయిదా పడి ఏప్రిల్ 27కు మారింది. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ మే 3వరకు పొడిగించటంతో రెండు కుటుంబాలు ఇక పెళ్లి వాయిదా వేయకూడదని నిశ్చయించుకున్నాయి. సోమవారం కలెక్టరేట్లో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా కొద్దిమంది బంధువులు, అధికారుల మధ్య తంతును ముగించాయి. పెళ్లి కుమారుడు టుటు తన రెండు నెలల జీతం 12వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందజేశాడు.
Comments
Please login to add a commentAdd a comment