
దండల పెళ్లి చేసుకున్న రవికుమార్, శివలీల
జడ్చర్ల టౌన్: యువత స్వాభిమాన పద్ధతిలో దండల మార్పిడి పెళ్లిళ్లు చేసుకోవాలని నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేష్ అన్నారు. శుక్రవారం జడ్చర్ల మండలం బూర్గుపల్లిలో శివలీల, రవికుమార్ ఈ పద్ధతిలోనే పెళ్లి చేసుకున్నారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ అనవసరపు ఖర్చులు లేకుండా ఇరు కుటుంబాలు పట్టింపులకు వెళ్లకుండా బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల మధ్య ఇలాంటి పెళ్లిళ్లు చేసుకోవాలన్నారు. కాగా, మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేలా మ్యాజిక్ ప్రదర్శన ఇచ్చారు. కార్యక్రమంలో నాస్తిక సమాజం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల అధ్యక్షులు ఉషాని సత్యశోధక్, సురేష్, చిన్నికృష్ణ; సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాకేష్, పెళ్లి వేదిక నాయకురాలు గాండ్ల సుజాత, తెలంగాణ ధూంధాం ఫేం స్వర్ణక్క తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment