న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తొలిసారిగా శుక్రవారం కేరళలో పర్యటించనున్నారు. నేతలు ఇరువురూ బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం 11.35 గంటలకు కొచ్చిలోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. శనివారం ఉదయం గురువాయూర్‌లోని శ్రీకృష్ణ ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు.
గురువాయూర్‌లో శాశ్వత హెలిపాడ్‌ను ప్రారంభించి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసగింస్తారు. ఇక కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తనను గెలిపించిన వయనాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు కేరళలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం కోజికోడ్‌కు చేరుకోనున్న రాహుల్ రెండురోజుల పాటు వయనాద్‌లో ఉంటారని చెబుతున్నారు. మలప్పురం,వయనాద్ జిల్లాల్లో రాహుల్ ఆరు రోడ్‌షోల్లో పాల్గొంటారు. కాగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment