Kerala tour
-
వర్కలా బాయ్స్
ఇటీవల ‘ముంజమ్మల్ బాయ్స్’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. బిలంలో పడ్డ స్నేహితుణ్ణి బయటకు లాగడం కథ. ఇక్కడ మనం ‘వర్కలా బాయ్స్’ని చూడొచ్చు. కర్నాటక నుంచి కేరళ విహారానికి వచ్చిన ఒక మహిళ వర్కలా బీచ్‌లో ఫోన్ జారవిడిచింది. అది అక్కడి రాళ్ల కింద చాలా లోతులో పడింది. అసలే అది ఐఫోన్. ఇంకేముంది వర్కలా అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. 7 గంటలు శ్రమించాక... ఏమైంది?విహారంలో అపశృతులు దొర్లితే మనసు పాడవుతుంది. కర్నాటక నుంచి కేరళలోని వర్కలాకు విహారానికి వచ్చిన ఒక మహిళ అక్కడి బ్లాక్ బీచ్‌లో ఉండగా పొరపాటున ఫోన్ జారింది. అది రాళ్ల కట్ట ఉన్న బీచ్. ఫోన్ రాళ్ల సందులో నుంచి లోపలికి పడిపోయింది. లక్షన్నర రూపాయల విలువ చేసే ఐఫోన్. వెంటనే ఆమె బస చేసిన హోటల్ సిబ్బంది, వర్కలా అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రాళ్లు తొలగించి ఫోన్ తీసే వీలు లేదు. తాడుతో తీగతో బయటకు లాగడం కూడా కష్టమైంది. దానికితోడు బీచ్‌లో భారీ అలలు, వాన పనికి అంతరాయం కలిగించాయి. దాంతో మరుసటి రోజు ఉదయం వచ్చి సుమారు ఏడు గంటలు కష్టపడి ఆ ఫోన్‌ని వెలికి తీశారు. అమ్మయ్య. కథ సుఖాంతం అయ్యింది. సుఖాంతం సంతోషమే కదా ఇస్తుంది. మంజుమ్మల్ బాయ్స్‌లో కూడా కథ సుఖాంతం కావడం వల్లే అది అంత పెద్ద హిట్ అయ్యిందని అనుకోవచ్చా? -
మణిపూర్ సమస్యను కామెడీగా మార్చేస్తారా?
వయనాడ్: మణిపూర్ హింసాకాండ వంటి అతి తీవ్రమైన సమస్యను ప్రధాని నరేంద్ర మోదీ నవ్వులాటగా మార్చేశారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. వయనాడ్ ఎంపీ అయిన ఆయన అనర్హత వేటు తొలగాక శనివారం తొలిసారి కేరళలో పర్యటించారు. కాల్పెట్టలో యూడీఎఫ్ బహిరంగ సభలో మాట్లాడారు. మణిపూర్ సమస్యను విపక్షాలు పార్లమెంటు దాకా తీసుకెళ్లి చర్చకు పెట్టినా దానిపై మాట్లాడటానికి కూడా మోదీ ఇష్టపడలేదని ఆరోపించారు. ‘అవిశ్వాస తీర్మానంపై చర్చకు బదులిస్తూ మోదీ 2 గంటల 13 నిమిషాల సేపు ప్రసంగించారు. అందులో ఏకంగా 2 గంటల పాటు కాంగ్రెస్ గురించి, నా గురించి, విపక్ష ఇండియా కూటమి గురించి... ఇలా అన్నింటి గురించీ మాట్లాడారు. అంతసేపూ మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు అన్నింటి మీదా జోకులు వేశారు. నవ్వుకున్నారు. కానీ అసలు సమస్య మణిపూర్ హింసాకాండ గురించి మాట్లాడేందుకు మాత్రం మోదీ కేటాయించింది కేవలం రెండంటే రెండే నిమిషాలు! భారత్ అనే భావనకే మణిపూర్‌లో తూట్లు పొడిచారు‘ అని మండిపడ్డారు. భారత్ అనే భావనకే తూట్లు పొడిచే వాళ్లు జాతీయవాదులు ఎలా అవుతారని రాహుల్ ప్రశ్నించారు. మణిపురీల దుస్థితి చూసి.. చలించిపోయా మణిపూర్ పర్యటన సందర్భంగా అక్కడి బాధితుల దుస్థితి చూసి ఆపాదమస్తకం చలించిపోయానని రాహుల్ గుర్తు చేసుకున్నారు. తన 19 ఏళ్ల రాజకీయ జీవితంలో అంతటి దారుణ పరిస్థితులను ఎన్నడూ చూడలేదని ఆవేదన వెలిబుచ్చారు. బీజేపీయే తన స్వార్థ ప్రయోజనాల కోసం మణిపూర్ ప్రజల మధ్య నిలువునా చీలిక తెచి్చందని ఆరోపించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే కనీసం ఐదేళ్లయినా పడుతుందని అభిప్రాయపడ్డారు. ‘ పునరావాస కేంద్రాల్లో ఒక మహిళ చెప్పింది విని కన్నీరు పెట్టా. కొడుకును ఆమె కళ్ల ముందే చంపారు. మిగతా అందరూ కుటుంబాలతో ఉంటే ఆమె మాత్రం ఒంటరిగా పడుకుని కనిపించింది. మీ వాళ్లెక్కడ అని అడిగితే ఎవరూ మిగల్లేదంటూ ఏడ్చేసింది. తన పక్కన పడుకున్న కొడుకును కళ్ల ముందే కాల్చేస్తే రాత్రంతా శవం పక్కనే గడిపానని గుర్తు చేసుకుంది. తనెలాగూ తిరిగి రాడని గుండె రాయి చేసుకుని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నానని చెప్పింది. ఆ ఘోర కలి గురించి చెప్తూ కూడా వణికిపోయింది. ఇంకో బాధిత మహిళ తనకు జరిగిన దారుణాలను తలచుకున్నంత మాత్రాన్నే స్పృహ తప్పి పడిపోయింది. మణిపూర్‌లో ఇలాంటి దారుణ గాథలు వేలాదిగా ఉన్నాయి. నా తల్లికి, చెల్లికి ఇలా జరిగితే ఎలా ఉంటుందని ఊహించుకున్నా‘ అన్నారు. -
ప్రధాని పర్యటన అబద్ధాలమయం
వయనాడ్ (కేరళ): గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలన్నీ అబద్ధాలు, విద్వేషం, విషపూరిత వ్యాఖ్యలతో నిండిపోయాయని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశ ప్రజలను విడగొట్టాలనే ఉద్దేశంతో మోదీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. తమ పార్టీ మాత్రం ప్రేమ, నిజం, ఆప్యాయత వైపు నిలిచిందని పేర్కొన్నారు. వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఎంపీగా తనను గెలిపినందుకు గానూ అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ రాహుల్ కేరళలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం కల్పెట్టా, కంబలకాడు, పనమారమ్ ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. అనంతరం పలు రోడ్‌షోలలో పాల్గొన్నారు. ‘మోదీ దగ్గర డబ్బు, మీడియా, ధనికులైన స్నేహితులు ఉండవచ్చు. కానీ దేశంలో బీజేపీ సృష్టించిన విద్వేషం, అసహనంపై కాంగ్రెస్ ఎప్పటికీ పోరాడుతూనే ఉంటుంది. ప్రేమ, ఆపాయ్యతతో వాటిని అధిగమిస్తుంది’అని రాహుల్ అన్నారు. వయనాడ్‌లో ఎన్నో సమస్యలు ఉన్నాయని.. అందరం కలిసికట్టుగా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. రాహుల్ రోడ్‌షోలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. -
నేడు కేరళలో మోదీ, రాహుల్ పర్యటన
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తొలిసారిగా శుక్రవారం కేరళలో పర్యటించనున్నారు. నేతలు ఇరువురూ బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ శుక్రవారం ఉదయం 11.35 గంటలకు కొచ్చిలోని ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకుని రాత్రి అక్కడే బసచేస్తారు. శనివారం ఉదయం గురువాయూర్లోని శ్రీకృష్ణ ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహిస్తారు. గురువాయూర్‌లో శాశ్వత హెలిపాడ్‌ను ప్రారంభించి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసగింస్తారు. ఇక కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ తనను గెలిపించిన వయనాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు కేరళలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం కోజికోడ్‌కు చేరుకోనున్న రాహుల్ రెండురోజుల పాటు వయనాద్‌లో ఉంటారని చెబుతున్నారు. మలప్పురం,వయనాద్ జిల్లాల్లో రాహుల్ ఆరు రోడ్‌షోల్లో పాల్గొంటారు. కాగా ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
కేరళలో సీఎం కేసీఆర్ వేసవి విడిది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు.. ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో గత ఆరు నెలలుగా బిజీబిజీగా గడిపిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొన్ని రోజుల పాటు బ్రేక్ తీసుకోనున్నారు. రాజకీయ వ్యూహాల రచన, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయన.. ఓ నాలుగైదు రోజులు ఆహ్లాదంగా గడపనున్నారు. వేసవి విడిదిలో భాగంగా కేసీఆర్ సోమవారం కుటుంబ సమేతంగా కేరళ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. కేరళ పర్యటనలో భాగంగా రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కేసీఆర్ సందర్శించనున్నట్లు సీఎంవో ఆదివారం తెలిపింది. కేరళ సీఎంతో భేటీ.. కేరళ పర్యటనలో భాగంగా కేసీఆర్ సోమవారం సాయంత్రం 6 గంటలకు త్రివేండ్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌తో భేటీ అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చిస్తారని, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయ పరిణామాల గురించి మాట్లాడతారని తెలిపాయి. -
కాంగ్రెస్, జేడీఎస్ చలో కేరళ!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన బీజేపీ.. విశ్వాస పరీక్షలో గెలుపొందేందుకు ‘ఆపరేషన్ కమల్’కి తెరలేపింది. అసెంబ్లీలో బల నిరూపణకు ప్రస్తుతమున్న 104 ఎమ్మెల్యేలు సహా మరో 8 మంది బీజేపీకి అవసరం. దీంతో మిగిలిన వారి కోసం కాంగ్రెస్, జేడీఎస్‌లపై దృష్టి పెట్టింది. దీంతో ఈ ఆపరేషన్‌లో చిక్కుకోకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు తమ ఎమ్మెల్యేలను కేరళలోని కొచ్చిలో ఉన్న ఓ రిసార్టుకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. కుమారస్వామి, సిద్దరామయ్య సహా జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్యనేతలు కొచ్చిలోని ‘క్రౌన్ ప్లాజా’ 5స్టార్ హోటల్లో బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హోటల్ ముందు కేరళ పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటుచేశారు. అయితే.. వీరిని తరలించేందుకు ఏర్పాటుచేసుకున్న ప్రత్యేక విమానానికి డీజీసీఏ అధికారులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో రోడ్డుమార్గంలో పుదుచ్చేరికి తరలించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఒక్కరొక్కరుగా.. హోస్పేట ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ (కాంగ్రెస్) రిసార్టుకు రాకుండానే అదృశ్యమయ్యారు. దీనికి తోడు.. బుధవారం రాత్రి ఇప్పుడే వస్తానంటూ రిసార్టు నుంచి బయటకెళ్లిన మస్కి ఎమ్మెల్యే ప్రతాప గౌడ తిరిగి రాలేదు. ఆరోగ్యం బాగాలేదంటూ గురువారం రిసార్ట్ నుంచి బయటకు వచ్చిన హుమ్నబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజశేఖర్ పాటిల్ కూడా అందుబాటులోకి రాలేదు. ఆ తర్వాత వీరి ఫోన్లు స్విచాఫ్ వస్తుండటంతో కూటమిలో కలవరం మొదలైంది. క్యూలో మరికొందరు! కాంగ్రెస్‌కు చెందిన కొందరు లింగాయత్ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎమ్మెల్యేలు వెంకట్రావ్ నాడగౌడ, మహంతేశ్ కౌజల్గి, అమరేగౌడ, డీఎస్ హులగేరితో కమలదళ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరితో పాటు వెంకటరమణప్ప, శివశంకరరెడ్డి, స్వతంత్ర ఎమ్మెల్యేలు నాగేష్, శంకర్లను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
తెలంగాణ ఏర్పాటుపై కేరళీయుల ఆసక్తి
రాష్ట్ర ప్రభుత్వ పాలనను వివరించిన మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిన అంశాలపై కేరళ పంచాయతీరాజ్ అధికారులు అమితాసక్తిని కనబరిచారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేరళ పంచాయతీరాజ్ వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన మంత్రి జూపల్లి తన రెండ్రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం త్రిశూర్ జిల్లా వెంకిటంగు గ్రామపంచాయతీని సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీఎం కేసీఆర్ సాగించిన ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తదితర అంశాలతో పాటు కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారికి మంత్రి వివరించారు. కేరళ స్థానిక పరిపాలన శాఖ మంత్రి కేటీ జలీల్‌తోనూ జూపల్లి బృందం సమావేశమయింది. పర్యటనలో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూకుమారి, జాయింట్ కమిషనర్ వెస్లీ ఉన్నారు. -
కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ
-
కేరళ వెళ్లిన సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విమానంలో కేరళ పర్యటనకు వెళ్లారు. రేపు త్రిసూర్‌లో జరిగే వివాహవేడుకకు ఆయన హాజరుకానున్నారు. కేరళ పర్యటనకు వెళ్లే ముందు తెలంగాణ పబ్లిక్ కమీషనక్కు ఉద్యోగులను కేటాయించే ఫైల్‌పై కేసీఆర్ సంతకం చేశారు. 350 మంది ఉద్యోగుల కేటాయింపునకు సుత్రప్రాయంగా అంగీకరించారు. -
రాహుల్ కారులో నిండుకున్న పెట్రోలు
తిరువనంతపురం: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారులో పెట్రోల్ అయిపోవడంతో దాని డ్రైవర్ హుటాహుటిన బంకుకు తరలించిన ఘటన ఇక్కడ జరిగింది. భద్రతా వైఫల్యంగా పరిగణిస్తున్న ఈ ఘటన వివరాలు.. కేరళ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ జరిగిన ‘కేరళ యాత్ర’లో రాహుల్ పాల్గొన్నారు. యాత్ర ముగిసిన తర్వాత హోం మంత్రి రమేష్ చెన్నితలతో కలిసి రాహుల్ తన అధికారిక కారులో విమానాశ్రయానికి బయల్దేరారు. ఈ క్రమంలో అలప్పుఝా సమీపంలోని మాన్‌కొంబు ప్రాంతానికి చేరుకునే సరికి కారులో పెట్రోలు అయిపోయింది. దీంతో డ్రైవర్ కారును సమీపంలోని బంకుకు తరలించి ఇంధనాన్ని నింపారు.