రాహుల్ కారులో నిండుకున్న పెట్రోలు | Security lapse as Rahul Gandhi's car runs short of fuel in Kerala | Sakshi
Sakshi News home page

రాహుల్ కారులో నిండుకున్న పెట్రోలు

Published Tue, Jan 14 2014 3:15 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

రాహుల్ కారులో నిండుకున్న పెట్రోలు

రాహుల్ కారులో నిండుకున్న పెట్రోలు

తిరువనంతపురం: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కారులో పెట్రోల్ అయిపోవడంతో దాని డ్రైవర్ హుటాహుటిన బంకుకు తరలించిన ఘటన ఇక్కడ జరిగింది. భద్రతా వైఫల్యంగా పరిగణిస్తున్న ఈ ఘటన వివరాలు.. కేరళ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ జరిగిన ‘కేరళ యాత్ర’లో రాహుల్ పాల్గొన్నారు. యాత్ర ముగిసిన తర్వాత హోం మంత్రి రమేష్ చెన్నితలతో కలిసి రాహుల్ తన అధికారిక కారులో విమానాశ్రయానికి బయల్దేరారు. ఈ క్రమంలో అలప్పుఝా సమీపంలోని మాన్‌కొంబు ప్రాంతానికి చేరుకునే సరికి కారులో పెట్రోలు అయిపోయింది. దీంతో డ్రైవర్ కారును సమీపంలోని బంకుకు తరలించి ఇంధనాన్ని నింపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement