అఫ్గాన్, ఖతర్, స్విస్, అమెరికా, మెక్సికోలతో బంధాలు బలోపేతం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఐదు దేశాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అఫ్ఘానిస్తాన్, ఖతర్, స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోల్లో పర్యటించనున్న ఆయన ఆ దేశాలతో వ్యాపారం, ఇంధన, భద్రత రంగాల్లో సహకారం పెంపుదలపై దృష్టి కేంద్రీకరిస్తారు. ఇందుకోసం ముందుగా శనివారం ఉదయం అఫ్ఘానిస్థాన్‌కు ప్రత్యేక విమానంలో మోదీ బయల్దేరారు.
అక్కడ హెరాత్‌లో నిర్మించిన అఫ్గాన్-భారత్ ఫ్రెండ్‌షిప్ డ్యామ్‌ను ఆ దేశాధ్యక్షుడితో కలసి ప్రారంభిస్తారు. శనివారమే అక్కడి నుంచి ఖతర్ వెళ్తారు. తర్వాత స్విట్జర్లాండ్‌లో పర్యటిస్తారు. సోమవారం అమెరికా చేరుకుని 7న ఒబామాతోమ చర్చిస్తారు. 8న ఆ దేశ పార్లమెంట్ (కాంగ్రెస్)లో ప్రసంగిస్తారు. అదేరోజు మెక్సికో చేరుకుని ఆ దేశ నేతలతో చర్చిస్తారు. ఆ రోజు సాయంత్రం తిరిగి స్వదేశానికి పయనమవుతారు.