ఒబామా పరిచయ వీడియోలో మోదీ | PM Narendra Modi only world leader in Barack Obama's DNC introduction video | Sakshi
Sakshi News home page

ఒబామా పరిచయ వీడియోలో మోదీ

Published Fri, Jul 29 2016 1:33 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

ఒబామా పరిచయ వీడియోలో మోదీ - Sakshi

ఒబామా పరిచయ వీడియోలో మోదీ

ఫిలడెల్పియా: డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదస్సులో అమెరికా అధ్యక్షుడు ఒబామాను పరిచయం చేస్తూ ప్రదర్శించిన వీడియోలో.. భారత ప్రధాని నరేంద్రమోదీకి కూడా చోటు లభించింది. వరుసగా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఒబామా ప్రయాణాన్ని, కృషిని వివరిస్తూ రూపొందించిన ఈ వీడియోలో.. ప్రపంచ దేశాల నేతలతో కలిసి ఒబామా చేసిన కృషిని వివరించారు. అందులో ప్రధాని మోదీ, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌కి మూన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయ్ హోలాం డ్‌లు కూడా కనిపించారు. ఒబామా చెప్తున్న విషయాన్ని మోదీ శ్రద్ధగా ఆలకిస్తున్న దృశ్యాన్ని చూపుతూ.. వాతావరణ మార్పుపై గత ఏడాది నవంబర్‌లో పారిస్‌లో కుదిరిన చరిత్రాత్మక ఒప్పందం గురించి వీడియోలో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement